PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మంత్రి టీజీ భరత్​ను కలిసిన ‘ఐఎంఏ’

1 min read

‘ నేషనల్​ డాక్టర్స్​ డే ’కు ప్రత్యేక అతిథిగా విచ్చేయాలని విన్నవించిన సభ్యులు

కర్నూలు, పల్లెవెలుగు:రాష్ట్ర ప‌రిశ్రమ‌లు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భ‌ర‌త్ ను శుక్రవారం ఇండియన్​ మెడికల్​ అసోసియేషన్​ (ఐఎంఏ) కర్నూలు జిల్లా అధ్యక్షుడు డా. రామచంద్రయ్య నాయుడు, జనరల్​ సెక్రటరి డా. ఎస్​వి. రామ్మోహన్​ రెడ్డి, ఈసీ మెంబరు, మానస హాస్పిటల్​ అధినేత డా. రమేష్​ బాబు నగరంలోని మౌర్య ఇన్​ లో మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. ఈ నెల 30న ఆదివారం ’ నేషనల్​ డాక్టర్స్​ డే ’ దినోత్సవం సందర్భంగా నగరంలోని ఐఎంఏ భవన్​లో జరిగే  కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా విచ్చేయాలని కోరారు. అంతేకాక ఐఎంఏ అభివృద్ధికి ప్రత్యేక చొరవ తీసుకోవాలని విన్నవించారు. ఇందుకు స్పందించిన మంత్రి టీజీ భరత్​ కర్నూలు మెడికల్​ హబ్​ గా పేరుగాంచిందని, అందుకు తగ్గట్టుగానే  వైద్యరంగంలో అభివృద్ధి చేయడంతోపాటు ఐఎంఏ భవన్​ కు ప్రత్యేక చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చినట్లు ఐఎంఏ అధ్యక్షుడు డా. రామచంద్రయ్య నాయుడు, జనరల్​ సెక్రటరి డా. ఎస్​వి. రామ్మోహన్​ రెడ్డి, ఈసీ మెంబరు డా. రమేష్​ బాబు తెలిపారు. కార్యక్రమంలో విశ్వభారతి మెడికల్​ కాలేజి ఈఎన్​టీ ప్రొఫెసర్​ డా. మహేంద్ర కుమార్​,  కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రి ప్లాస్టిక్​ సర్జరీ మరియు హెచ్​ఓడి డా. మంజుల బాయి, ప్రొఫెసర్​ ఆఫ్​ సర్జరి డిపార్ట్​మెంట్​ కేఎంసీ డా. మాధవి శ్యామల,  నేషనల్​ ఐఎంఏ రిప్రెసెంటెటివ్​ , ఆర్​.ఆర్​. హాస్పిటల్​ డైరెక్టర్​ డా. బాలమద్దయ్య,  కర్నూలు మాజీ డీఎం అండ్​ హెచ్​ఓ డా. శివ శంకర్​ రెడ్డి, నెఫ్రాలజి వైద్యులు, ఈసీమెంబరు డా. సాయివాణి, గైనకాలజీ రిటైర్డు వైద్యులు డా. వెంకట రమణ తదితరులు పాల్గొన్నారు.

About Author