మధ్యంతర భృతికి వెంటనే విడుదల చేయాలి… ఆపస్ డిమాండ్
1 min readపల్లెవెలుగు వెబ్ ఒంగోలు: ప్రభుత్వం వెంటనే మధ్యంతర భృతిని(ఐఆర్) ప్రకటించాలని ఆపస్ రాష్ట్ర సంఘటనా కార్యదర్శి సిహెచ్. శ్రావణ్ కుమార్ డిమాండ్ చేశారు. ఒంగోలులోని కేశవభవన్ లో నిర్వహించిన జిల్లా కార్య నిర్వాహక వర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ సంక్రాంతి కానుకగా 30 శాతం మధ్యంతర భృతిని వెంటనే మంజూరు చేయాలని కోరారు. అలాగే ఉద్యోగ, ఉపాధ్యాయులకు రావల్సిన సుమారు రు.3000 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని స్పష్టం చేశారు జిల్లా అధ్యక్షుడు కె. మల్లికార్జున రావు మాట్లాడుతూ ఏకీకృత సర్వీస్ రూల్స్ అమలుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. జూనియర్ కళాశాలల్లో 40 శాతం ప్రమోషన్లను టీచర్లకు ఇవ్వాలని, హైస్కూల్ ప్లస్‌లను కొనసాగించి, రెగ్యులర్ ప్రాతిపదికన ఉద్యోగోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు. ముఖ్య వ్యక్త బలరామకృష్ణ మాట్లాడుతూ విద్యార్థులలో నైతిక విలువలు పెంపొందించడానికి ఉపాధ్యాయులు కృషి చేయాలి అని సమాజ హితం కోసం ఉపాధ్యాయుడు పనిచేస్తున్నాడని అత్యున్నత స్థానంలో ఉపాధ్యాయుని గుర్తించాలని కోరారు. జిల్లా ప్రధాన కార్యదర్శి టీ.దిలీప్ చక్రవర్తి గత నాలుగు నెలల కాలంలో జరిగిన కార్యకలాపాలపై నివేదిక సమర్పించారు.ఏకేవీకే డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ కే వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ శ్రీ చాగంటి కోటేశ్వరరావు ని విద్యా సలహాదారుగా నియమించడాన్ని వ్యతిరేకించడం తగదని విద్యార్థులు సత్ప్రవర్తన కలిగిన పౌరులుగా తయారు కావాలంటే చిన్నప్పటినుండే వారిలో నైతిక విలువలు కలిగిన పాఠ్యాంశాలను బోధించడానికి వారి సలహాలు, సూచనలు అవసరమన్నారు. ఈ సమావేశంలో అపస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సిహెచ్. హిమజ, జిల్లా కోశాధికారి గుణ ప్రసాద్ జిల్లా బాధ్యులు శంకర్, నరసింహారావు, సుబ్రహ్మణ్యం, జీవి నారాయణ, కృష్ణయ్య, మార్కండేయులు, శేషారావు, వై.వెంకట్రావు , వై వెంకటేశ్వర్లు, మస్తాన్వలి, రామచంద్రరావు, సుబ్బారావు, తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో పదవీ విరమణ చెందిన శ్రీ వై కోటేశ్వరరావు ని ఇటీవల ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలైన ఆత్రేయ, ఎం.ఎన్.కె శర్మగార్లను సన్మానించారు.