వైద్య విద్యా బోధకులు నిరంతరం తమ టీచింగ్ స్కిల్స్ మెరుగుపరుచుకోవాలి
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: వైద్య విద్యా బోధకులు నిరంతరం తమ టీచింగ్ స్కిల్స్ మెరుగుపొరచుకోవాలి అని అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ & ప్రిన్సిపల్ డాక్టర్ కె . చిట్టి నరసమ్మ అన్నారు. శుక్రవారం కర్నూలు మెడికల్ కాలేజీలోని మెడికల్ ఎడ్యుకేషన్ యూనిట్ లో యన్.యం.సి గైడ్ లైన్స్ మేరకు యం.ఈ.యు కోఆర్డినేటర్ ప్రొఫెసర్ డాక్టర్ సింధియా శుభప్రద ఆధ్వర్యంలో మూడు రోజుల శిక్షణ కార్యక్రమము జరుగుతున్నది. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ బోధకులు తన స్కిల్స్ మెరుగు పరుచుకుంటే వైద్య విద్యార్థులకి ఎంతో ఉపయోగ పడుతుందని అందుకే నిరంతరం నేర్చు కుంటూనే వుండాలని ఆమె కోరారు .ఈ శిక్షణ కార్యక్రమంలో నోడల్ సెంటర్ అయిన భాస్కర మెడికల్ కాలేజ్ నుంచి అబ్జర్వర్ గా డాక్టర్ సాజియా పర్విన్ హాజరు కావడం జరిగింది. ఈ కార్యక్రమానికి వైస్ ప్రిన్సిపల్ డా.సాయి సుధీర్, మరియు యం.ఈ.యు సభ్యులు డా.విజయనంద్ బాబు, డా.లక్ష్మి, డా.విశాల,డా.అరుtణ, డా.కుముద, డా.భాను ప్రకాష్, డా కోటేశ్వర రావ్ మరియు 30 మంది వైద్యులు శిక్షణ కొరకు హాజరు కావడం జరిగింది.