ఇంతియాజ్‌ను భారీ మెజార్టీతో గెలిపించండి..
1 min readవైసీపీ హ్యాట్రిక్ కొట్టాల్సిందే….
- కర్నూలు అభివృద్ధి… బాధ్యత నాది..
- సిద్ధం సభలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
కర్నూలు, పల్లెవెలుగు:వైసీపీ కర్నూలు అసెంబ్లీ అభ్యర్థి రిటైర్డు ఐఏఎస్ ఇంతియాజ్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని కర్నూలు ప్రజలను సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోరారు. కర్నూలు ప్రజలు రెండు సార్లు వైసీపీ కి అవకాశం ఇచ్చారని, ఈ సారి కూడా వైసీపీకి ఓటు వేసి హ్యాట్రిక్ సాధించేలా చూడాలన్నారు. నగరాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నాది అని హామీ ఇచ్చిన సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి…. ఇంతియాజ్ ను గెలిపిస్తే … అందుబాటులో ఉండి మీకు సేవ చేస్తాడని తెలిపారు. కలెక్టర్‌గా విధులు నిర్వర్తించిన ఇంతియాజ్… ఆయన ఆలోచన విధానం స్మార్ట్‌గా ఉంటుందని, కర్నూలు అభివృద్ధికి ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా… అందుకు పూర్తి స్థాయిలో సహకరిస్తానని ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ నెల 13న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఇంతియాజ్‌ను, ఎంపీగా బీవై రామయ్యను గెలిపించాలని నగర ప్రజలను అభ్యర్థించారు. సిద్ధం సభలో పాణ్యం ఎమ్మెల్యే కాట సాని రాంభూపాల్ రెడ్డి, ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి, వైసీపీ నాయకులు,కార్యకర్తలు, ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.