అట్టహాసం…ఇంతియాజ్ నామినేషన్ పర్వం…
1 min readమండు టెండను సైతం లెక్క చేయని జనం
- గజమాలతో స్వాగతం పలికిన జనం
కర్నూలు, పల్లెవెలుగు:అశేష జన వాహిని మధ్యన కర్నూల్ వైసీపీ అభ్యర్థి ఏ ఎండి ఇంతియాజ్ బుధవారం తన నామినేషన్ కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ నందు రిటర్నింగ్ అధికారి భార్గవ తేజకు అందజేశారు. ఉదయం తొమ్మిది గంటలకు స్వర్గీయ డా.ఇస్మాయిల్ స్వగృహంలో కుటుంబ సభ్యులతో కలిసి సర్వమత ప్రార్థనలు జరిపిన తర్వాత నగరంలోని జమ్మి చెట్టు ప్రాంతానికి చేరుకున్నారు. ఆయనతోపాటు కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి, వైసీపీ నాయకులు అహమ్మద్ అలీఖాన్, కర్నూలు పార్లమెంట్ అభ్యర్థి బి వై రామయ్య, కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ విజయ మనోహరి, వైసీపీ నాయకులుతో కలిసి ప్రచార రథం పైకి ఎక్కారు అప్పటికే వేలాదిగా తరలివచ్చిన వైసీపీ కార్పొరేటర్లు నాయకులు కార్యకర్తలు ప్రజలు అభిమానులతో కలిసి జమ్మి చెట్టు ప్రాంతం నుంచి భారీ జన సందోహంతో ర్యాలీ ముందుకు సాగింది.
ఇంతియాజ్ కు… బ్రహ్మరథం…
పాతబస్తీలో వన్ టౌన్, పూల బజార్, చౌక్, నెహ్రూ రోడ్డు, పాత కంట్రోల్ రూమ్, వైయస్సార్ సర్కిల్ మీదుగా మునిసిపల్ కార్యాలయం వరకు ర్యాలీ కొనసాగింది. దాదాపు పైగా నాలుగు గంటలకు పైగా కొనసాగిన ర్యాలీలో వీధుల్లోకి వచ్చిన ప్రజలు మహిళలు చేతులు ఊపుతూ స్వాగతం పలుకుతూ ఏ ఎండి ఇంతియాజ్ కు బ్రహ్మరథం పట్టారు. మండుటెండలను సైతం లెక్కచేయక మహిళలు కార్యకర్తలు వేలాదిగా ర్యాలీలో పాల్గొన్నారు. వన్ టౌన్, పాత కంట్రోల్ రూమ్ మహావీర్ చౌక్ వద్ద భారీ క్రేన్లతో గజ మాలలు వేసి కార్యకర్తలు స్వాగతం పలికారు. వైసిపి అభ్యర్థి ఏ ఎండి ఇంతియాజ్ తో పాటు కర్నూలు పార్లమెంట్ అభ్యర్థి బివై రామయ్య, కర్నూలు శాసనసభ్యులు హఫీజ్ ఖాన్, కర్నూలు మాజీ శాసనసభ్యులు ఎస్వి మోహన్ రెడ్డి, వైసిపి నాయకులు అహ్మద్ అలీ ఖాన్ లతో కలిసి రిటర్నింగ్ అధికారికి నామినేషన్ దాఖలు చేశారు. కార్యక్రమంలో ఏ ఎండి ఇంతియాజ్ సోదరులు వైసీపీ నాయకులు ఎండి అస్లాం, కేఎం అన్వర్ భాష, మునవర్ భాష, ఇర్ఫాన్, వైసిపి కార్పొరేటర్లు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.