బైరాపురంలో..”ఇది మంచి ప్రభుత్వం”
1 min readపల్లెవెలుగు వెబ్ మిడుతూరు (నందికొట్కూరు): నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని బైరాపురం గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని గ్రామ టిడిపి నాయకులు మొల్ల చాకర్ వలి ఆధ్వర్యంలో మంగళవారం”ఇది మంచి ప్రభుత్వం”అనే కార్యక్రమంలో భాగంగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వం నుండి లబ్ధి పొందిన కుటుంబాల ఇండ్లకు వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ గ్రామంలో లబ్ధిదారుల ఇండ్లకు స్టిక్కర్లను అతికించారు.ఈ కార్యక్రమంలో పంచాయితీ కార్యదర్శి కేశావతి,గ్రామ టిడిపి నాయకులు రాజేశ్వర్ రెడ్డి మాజీ సర్పంచ్ సుధాకర్ రాముడు,వీఆర్వో రామకృష్ణ సచివాలయ సిబ్బంది హరీష్ త్రివేణి జయమ్మ అంగన్వాడీ మరియు ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.