ఎమ్మిగనూరు లో ఘనంగా నూర్ భాష దూదేకుల సింహగర్జన
1 min readభారీ మెజారిటీ తో గెలిపించండి : బుట్టారేణుక
పల్లెవెలుగు వెబ్ ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరు పట్టణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూర్ బాషా (దూదేకుల) ముస్లిం సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు షేక్ సయ్యద్ బాజీ ఎమ్మిగనూరు పట్టణ మునిసిపల్ వైస్ చైర్మన్ నజీర్ అహమ్మద్ ఆధ్వర్యంలో స్థానిక బాబు ఫంక్షన్ హాల్ నందు బుదవారం నూర్ బాష దూదేకులస్థుల సింహగర్జన కార్యక్రమం భారీగా నిర్వహించారు. కార్యక్రమానికి ఎమ్మిగనూరు నియోజకవర్గ వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి బుట్టారేణుక హాజరై మాట్లాడారు. సామాజిక వర్గానికి చెందిన నూర్ బాషా దూదేకులస్తుల కొరకు ఓ కమ్యూనిటీ హాల్ ను ఏర్పాటు చేస్తామన్నారు. దూదేకుల కులాన్ని కులం పేరుతో ఎవరైనా విమర్శించినట్లయితే వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకునే విధంగా జీవో తీసుకొచ్చినటువంటి ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కొనియాడారు. మే 13 న జరిగే ఓటింగ్ కు బటన్ నొక్కి ఎమ్మెల్యే గా భారీ మెజారిటీ తో గెలిపించాలని కోరారు. సంక్షేమం అభివృద్ధి రెండు సమపాళ్లలో జరగాలంటే జగనన్నను మళ్ళీ ముఖ్యమంత్రిగా గెలిపించాలన్నారు.ఈ కార్యక్రమంలో దూదేకుల సంఘం నాయకులు మన్సూర్ అహమ్మద్, రాజాచాంద్, చైతన్య ఖాసిం, టెలిఫోన్ నబిరసూల్, సిరాలదొడ్డి ఖాజ, మాబుహుస్సేన్, ఇర్ఫాన్, సికిందర్, బద్రుల్, మధు, డిష్ మాబు, గఫూర్, మస్తాన్, మండలాల్లోని గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.