ఉపాధి పనుల్లో..భారీగా మింగేశారు..
1 min readగోకులం,సచివాలయ పనులు చేయకున్నా లక్షల్లో మంజూరు
ఉపాధి సభలో పలు విషయాలు వెలుగులోకి
8 లక్షల రికవరీకి జిల్లా అధికారుల ఆదేశాలు..
పల్లెవెలుగు వెబ్ మిడుతూరు (నందికొట్కూరు): గ్రామాల్లో గోకులం షెడ్లు,సచివాలయాల పనులు చేయకుండానే మిడుతూరు మండలంలో 4,66,642 రూ.లు అవినీతి జరిగిందని నిన్న మిడుతూరు మండల పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో జరిగిన ఉపాధి హామీ పథకం బహిరంగ సభలో కొన్ని వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.లక్షల్లో బిల్లులు నొక్కేశారు. వివరాల్లోకి వెళితే నంద్యాల జిల్లా మిడుతూరు మండలంలో 17వ రౌండ్ 2023 ఏప్రిల్ నుండి 2024 మార్చి వరకు గ్రామాల్లో జరిగిన ఉపాధి వార్షిక పనుల్లో భాగంగా డీఆర్పిలు తనిఖీ చేపట్టారు.అనంతరం చివరి రోజున నిన్న మిడుతూరులో బహిరంగ సభకు జిల్లా డ్వామా అధికారి జనార్దన్ రావు, మానిటరింగ్ ఎవాల్యూయే షన్ ఏపీడీ టి.విజయ భాస్కర్ నాయుడు,ఏపీడీలు బాలోజీ నాయక్,అన్వరా బేగం హాజరయ్యారు.వాలంటీర్లకు మరియు ఎక్కడెక్కడో పనులు చేస్తున్న వారికి ఉపాధి బిల్లులు మంజూరు చేయడం పట్ల పలువురు జిల్లా అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. గోకులం షెడ్లు సచివాలయ నిర్మాణాలు తదితరు ఉపాధి హామీ పనుల్లో మండలంలో చెరుకుచెర్ల గ్రామంలో అత్యధికంగా 1,67,767 రూ.లు.. మిడుతూరు గ్రామంలో 1,62,837 రూ.లు అవినీతి జరిగింది. దేవనూరులో గతంలో నిర్మించిన సచివాలయానికి ప్లాస్టింగ్ చేయకుండానే చేసినట్లుగా 1 లక్ష 3 వేల రూ.లు మంజూరు చేసినట్లు వెల్లడయింది.గ్రామాల వారీగా వీపనగండ్లలో 12,625.. నాగలూటి-530,సుంకేసుల- 809,రోళ్లపాడు-44,846, తిమ్మాపురం-8,998, మాసపేట-961,అలగనూరు 1,556,జలకనూరు 2,600, చింతలపల్లి 30,718,పైపాలెం 855,తలముడిపి 2,429, చౌటుకూరు 11,329, కడుమూరు 31,722 రూ.లు అవినీతి జరగ్గా అంతేకాకుండా అన్ని గ్రామాల్లో రైతుల పొలాల్లో పండ్ల మొక్కలకు 8 లక్షల 53 వేల 001 రూ.లు ఖర్చు చేయగా వీటన్నిటిని తిరిగి చెల్లించాలని జిల్లా అధికారులు ఆదేశించారు. 2,800 జరిమానా విధించారు. చెరుకుచెర్ల గ్రామంలో చాలా అవినీతి జరిగిందని ఆధారాలతో సహా నందికొట్కూర్ టిడీపీ సీనియర్ నాయకులు మాణిక్ రాజు అధికారులకు ఫిర్యాదు చేశారు.ఈ కార్యక్రమంలో హెచ్ఆర్ మేనేజర్ శీభా, క్వాలిటీ కంట్రోలర్ అధికారి ఎస్ గంగాద్రి,ఎస్ఆర్పి మురాద్,ఎంపీడీవో దశరథ రామయ్య,ఏపీవో జయంతి,డీఆర్పీలు,టీఏలు, ఎఫ్ఏలు పాల్గొన్నారు.