PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మంత్రుల ఎదుట..తల్లి కన్నీటి పర్యంతం

1 min read

-బాధిత కుటుంబానికి 10 లక్షల చెక్కు

-ఈ ఘటన వెనుక ఎంతటి వారున్నా వదలి పెట్టేది లేదు

-రాష్ట్ర మంత్రులు జనార్దన్ రెడ్డి,ఫరూక్

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: సార్ మా కూతురు అదృశ్యం అయ్యి 13 రోజులు అయ్యింది మా పాప ఆచూకీ ఎక్కడ సార్ అంటూ ఆ తల్లీ రాష్ట్ర మంత్రుల ఎదుట కన్నీటి పర్యంత మయ్యారు.తల్లి సుజాతమ్మ ఏడుస్తూ ఉండగా అక్కడున్న అందరి హృదయాలను కలచివేసింది.నువ్వు ధైర్యంగా ఉండాలమ్మా మీ కుటుంబానికి మేము అండగా ఉంటామంటూ మంత్రులు ఆమె భుజం తట్టి ధైర్యం చెప్పారు.రాష్ట్రంలోనే సంచలనం సృష్టించిన నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం ముచ్చుమర్రి గ్రామానికి చెందిన అదృశం అయిన వాసంతి కుటుంబాన్ని రాష్ట్ర మంత్రులు రోడ్లు భవనాలు మౌలిక సదుపాయాలు పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మరియు మైనార్టీ న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ శుక్రవారం ఉదయం వారి ఇంటికి వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. కుటుంబం ఆర్థికంగా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రులు ఆ కుటుంబానికి 10 లక్షల రూపాయల చెక్కు అందజేశారు.ఈ సందర్భంగా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ తల్లిదండ్రులు ఇద్దరు పిల్లలతో కుటుంబం తల్లడిల్లుతుంటే నా హృదయం కలచివేస్తుందని ఈ ఘటన వెనుక ఎంతటి వారు ఉన్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదని రాబోయే రోజుల్లో ఇలాంటి ఘటనలు జరగకుండా వాడు భయపడే విధంగా ప్రభుత్వం అఠిన చర్యలు తీ సుకుంటుందన్నారు.పాప మృతదేహం దొరికేంత వరకు వదిలి పెట్టే ప్రసక్తే లేదని పిల్లల చదువులకు ప్రభుత్వం ఆదుకుంటుందని ఆయన కుటుంబానికి హామీ ఇచ్చారు. పాప శవాన్ని ఏమి చేశారో తెలియడం లేదని కొత్తగా వచ్చిన ఎస్పీ బాలిక మృతదేహం కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేస్తారని తప్పు చేసిన వారిని కఠినంగా శిక్షిస్తామని మంత్రి ఫరూక్ అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జి రాజకుమారి, ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా,  నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి, నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య,ఆర్డీఓ దాసు, డిఎస్పీ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

About Author