జాలిమంచిలో..80 కుటుంబాలు బీజేపీలో చేరిక..
1 min readకండువా కప్పి స్వాగతం పలికిన కూటమి అభ్యర్థి డా. పార్థసారధి
ఆదోని, పల్లెవెలుగు: గ్రామాలు అభివృద్ధి చెందాలంటే…. ఎమ్మెల్యే మారాలని.. లేదంటే అభివృద్ధిలో మరో 30 ఏళ్లు వెనుకబడి పోయే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు ఆదోని కూటమి అభ్యర్థి డా. పార్థసారధి. నియోజకవర్గం పరిధిలోని జాలిమంచి గ్రామం నుండి సుమారు 80 కుటుంబాలు సోమవారం బీజేపీ తీర్థం పుచ్చుకున్నాయి. ఈ సందర్భంగా డా. పార్థసారధి మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం లో గ్రామాల అభివృద్ధి కుంటూపడిందని కేంద్రం ఇచ్చే నిధులలో కూడా అవినీతికి తెరలేపారని, గ్రామాల్లో కనీసం తాగడానికి కూడా నీళ్లు లేని దౌర్భాగ్య పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు కేంద్ర ప్రభుత్వం అమలుపరుస్తున్న సంక్షేమాన్ని చూసి ప్రజలు బిజెపిలోకి బ్రహ్మరథం పట్టారని అన్నారు. జాలిమంచి గ్రామానికి చెందిన బారికి తిక్కయ్య, ఈరన్న,అబ్రహం,బసవరాజు తదితర కుటుంబాల వారు బిజెపి కండువాలు వేసుకున్నారు.