కర్నూల్లో 97.19 శాతం పింఛన్ల పంపిణీ పూర్తి
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: శనివారం కర్నూలు నగర వ్యాప్తంగా శనివారం 97.19 శాతం ఎన్టీఆర్ భరోసా పింఛన్లను అధికార యంత్రాంగం పంపిణీ చేసింది. అరోరా నగర్‌లో నగరపాలక కార్యాలయ మేనేజర్ ఎన్.చిన్నరాముడు పంపిణీలో పాల్గొని, లబ్ధిదారులకు నగదు అందించారు. నగరంలో 137 సచివాలయాల పరిధిలో 35,421 మంది లబ్ధిదారులు ఉండగా, శనివారం సాయంత్రం 6.10 గంటలకు 34,423 మంది లబ్ధిదారులకు పింఛన్ల నగదును సచివాలయ సిబ్బంది అందించారు. కాగా శనివారం సాయంత్రానికి 97.19% శాతం పింఛన్ల పంపిణీ పూర్తవ్వగా, కొందరు లబ్ధిదారులు అందుబాటు లేరు.