‘నామినేటెడ్ ’లో.. బీసీలకు న్యాయం చేస్తా..
1 min readబి .సి .సంక్షేమ ,చేనేత ,జౌళి శాఖ మంత్రి ఎస్ . సవితమ్మ హామీ
కర్నూలు, పల్లెవెలుగు: నామినేటెడ్ పోస్టుల భర్తీలో తెలుగుదేశం పార్టీని నమ్ముకుని కష్టపడి పనిచేసిన బీసీలకు న్యాయం చేస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారు బి .సి .సంక్షేమ ,చేనేత ,జౌళి శాఖ మంత్రి ఎస్ . సవితమ్మ. ఆదివారం విజయవాడలోని ఆమె నివాసంలో కురువ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గుడిసె శివన్న, కర్నూలు జిల్లా కురవ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.కే .రంగస్వామి, మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు టి లీలమ్మ,టి .విజయలక్ష్మి ,,జిల్లా ఉపాధ్యక్షులు పెద్దపాడు ధనుంజయ ,కొత్తపల్లి దేవేంద్ర, తవుడు శ్రీనివాసులు,.కే . వెంకటేశ్వర్లు ,కే .,నాగశేషులు ,కే .మహేష్ తదితరులు మంత్రి సవితమ్మను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయంలో కురువ కులస్థులకు న్యాయం చేయాలని కోరగా… అందుకు మంత్రి సవితమ్మ బీసీలకు న్యాయం చేయడంలో కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం మంత్రి సవితమ్మకు వినతిపత్రం అందజేశారు.