రెడ్ బుక్ రాజ్యాంగంలో- అక్రమ అరెస్టులు
1 min readవైఎస్ఆర్సిపి జిల్లా విద్యార్థి విభాగం కార్యదర్శి గుమ్మల సాయి కుమార్ రెడ్డి
పల్లెవెలుగు వెబ్ చెన్నూరు : రాష్ట్రంలో నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం అమలు అవుతుందని వైయస్సార్ సిపి నాయకులు, కార్యకర్తలు ఈ రెడ్ బుక్ రాజ్యాంగంతో అక్రమ అరెస్టులకు బలవుతున్నారని వైఎస్ఆర్సిపి జిల్లా విద్యార్థి విభాగం కార్యదర్శి గుమ్మల్ల సాయికుమార్ రెడ్డి ఆరోపించారు. మంగళవారం ఆయన చెన్నూరు లో విలేకరులతో మాట్లాడుతూ , కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలే టార్గెట్ గా తీసుకొని వారిని అక్రమ అరెస్టులతో తీవ్ర ఇబ్బందులకు గురి చేయడం జరుగుతుందన్నారు. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో వైఎస్ఆర్సిపి కార్యకర్తలను వేధింపులకు గురి చేస్తున్నారని ఇంత అరాచకం, ఇంత అన్యాయం గతంలో ఎప్పుడూ లేదని పౌర హక్కులను కాలరాసే విధంగా కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్నదని ఇది సరైన పద్ధతి కాదని ఆయన కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు. వైయస్సార్ సిపి నాయకులు వర్ర రవీంద్రనాథ్ రెడ్డిని అలాగే వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా కో కన్వీనర్ కల్లూరు రుద్రసేనారెడ్డిని అరెస్టు చేయడం దారుణమని, అరెస్టు చేసి అతనిని పోలీసులు చితక బాధడం ఎంతవరకు సబబు అని ఆయన ప్రశ్నించారు. రాజ్యాంగంలో వాక్ స్వాతంత్రాన్ని కాలరాసి వారి మనోభావాలను హరించడం బాధాకరమని తెలిపారు. ఇలా ఎంత మందిని అరెస్టు చేసి హింసిస్తారని ఇలాంటి అరెస్టులకు వైయస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకులు భయపడరని, కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.