నాలుగవ వార్డులో..ఇది మంచి ప్రభుత్వం
1 min readపల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని నాలుగవ వార్డులో వార్డు కౌన్సిలర్ నల్లబోతుల రాజ శేఖర్ ఆధ్వర్యంలో చేపట్టిన ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమంలో మున్సిపాలిటీ కమిషనర్ బేబీ పాల్గొన్నారు.శనివారం మున్సిపాలిటీ కమిషనర్ మరియు వార్డ్ కౌన్సిలర్ రాజ శేఖర్,అధికారులు కాలనీలో ఉన్న ఇంటింటికి వెళ్లి ఇది మంచి ప్రభుత్వం అనే స్టిక్కర్లను ఇండ్లకు అతికిస్తూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వారు వివరించారు.కాలనీలో ఉన్న పలు సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కాలనీ వాసులు మున్సిపాలిటీ కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు.కాలనీ ప్రజలకు ఏ సమస్య ఉన్నా సరే నా దృష్టికి తీసుకువస్తే నేను వాటిని పరిష్కరిస్తానని మున్సిపాలిటీ కమిషనర్ వారికి హామీ ఇచ్చారు.అంతే కాకుండా ప్రభుత్వం అందిస్తున్న వివిధ సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుంటూ మీరు అభివృద్ధి చెందాలని మున్సిపాలిటీ కమిషనర్ ప్రజలకు సూచించారు.