మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ రేసులో హెచ్. చిదానంద
1 min readపల్లెవెలుగు వెబ్ హొళగుంద: ఆలూరు నియోజకవర్గం మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ రేసులోభారతీయ జనతా పార్టీకి చెందిన సీనియర్ నాయకులు హెచ్. చిదానంద భారతీయ జనతా పార్టీ ఎస్సీ సామాజిక వర్గాని కి చెందిన సీనియర్ నాయకులు గత 30 సంవత్సరాల నుండి భారతీయ జనతా పార్టీకి ఎనలేని సేవలు చేసిన హోళగుంద మండలానికి చెందిన నేషనల్ కౌన్సిల్ మెంబర్ హెచ్. చిదానందకి ఎన్.డి.ఏ. కూటమిలో భాగంగా ఆలూరు నియోజకవర్గం మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ పదవి ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ చెందిన మండల కమిటీ అధ్యక్షురాలు ఈడిగ సుధా కోరడమైనది .ఈ సందర్భంగా ఈడిగ సుధా మాట్లాడుతూ గతంలో ఈయన ఆలూరు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పోటీ చేశారని వీరు పార్టీ చేసిన అభివృద్ధికి గుర్తించి పార్టీ అధిష్టానం వీరికి ఆలూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి ఇవ్వాలని మండల కమిటీ తరఫున కోరుతున్నామని తెలియజేయడమైనది.