ఉరుకుందలో తలనీలాల అధిక వసూళ్లు దందా
1 min readపల్లెవెలుగు వెబ్ కౌతాళం: మండల పరిధిలో ఉరుకుంద ఈరన్న స్వామి శ్రావణ మాస సందర్భంగా మొదటి సోమవారం అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు అలాగే తలనీలలో సమర్పించుకున్నారు తలనీలలో భక్తుల నుంచి అధిక వసూళ్లు చేస్తున్నారని ఒక భక్తుడు ఆవేదన వ్యక్తం చేశారు కర్ణాటక రాయచూర్ మల్లేష్ అనే వ్యక్తి దేవదాయ అధికారుల మీద మండిపడ్డారు తలనీలాల టికెట్ 40 రూపాయలు అది కాక 100 రూపాయలు అదనంగా తన భార్య రెండు వెంట్రుకల కత్తెరకు 50 రూపాయలు ఇవ్వాల్సిందని పట్టు పట్టి అక్కడ సిబ్బంది అడిగి ఇప్పించుకుంటున్నారని అన్నారు అధికారులు పెట్టుకొని ఇలా భక్తుల ముక్కు పిండి వసూలు చేయడం మంచి పద్ధతి కాదని ఆన్నారు. తలనీలాలు చేసే సిబ్బంది మీద చర్యలు చేసుకోవాలని కోరారు.