కురువ సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ .. కర్నూలు జిల్లా కురువ సంఘం
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: 2025 వ సంవత్సరం కర్నూలు జిల్లా కురవ సంఘం క్యాలెండర్ ను స్థానిక కర్నూలు ఎం. పి. కార్యాలయం ప్రాంగణం లో జిల్లా అధ్యక్షుడు పత్తికొండ శ్రీనివాసులు అసోసియేట్ అధ్యక్షులు గుడిసె శివన్న,ప్రధాన కార్యదర్శి ఎం. కె.రంగస్వామి మహిళా సంఘం అధ్యక్షురాలు శ్రీలీలమ్మ, ప్రదానకార్యదర్శి అనిత కురువ సంఘం నాయకులు బుధవారం ఉదయం క్యాలెండర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పత్తికొండ శ్రీనివాసులు మాట్లాడుతూ కురువ కులస్థులందరూ ఐక్యంగా ఉండాలని పిల్లలను చదివించాలని ఐక్యమత్యంతో ఉంటే అన్ని సాధించుకుంటారని ఏ సమస్య వచ్చిన కమిటీ సభ్యులు అందుబాటులో ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కర్నూలు జిల్లా గొర్రెల సంఘం అధ్యక్షులు శ్రీనివాసులు, డైరెక్టర్, యుగంధర్ ప్రసాద్,ఉపాధ్యక్షులు బి. వెంకటేశ్వర్లు, పెద్దపాడు ధనుంజయ,కె.దేవేంద్ర కోశాధికారి కేసీ నాగన్న, పాల సుంకన్న,బి. సి. తిరుపాలు, బి. రామకృష్ణ, కె. సోమన్న, వెంకటేశ్వర్లు,చిరంజీవి, రాజశేఖర్, పాపారాయుడు, దివాకర్,తేజస్విని, లక్ష్మన్న, చిన్నయ్య, నాగశేషులు, రఘు తదితరులు పాల్గొన్నారు.