చింతలపల్లిలో కేవీపీఎస్ డైరీల ఆవిష్కరణ..
1 min readపల్లెవెలుగు వెబ్ మిడుతూరు (నందికొట్కూరు): నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని చింతలపల్లి గ్రామంలో బుధవారం ఎస్సీ కాలనీలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నూతన డైరీలను కెవిపిఎస్ ఆధ్వర్యంలో మండల కార్యదర్శి జి లింగస్వామి,సహాయ కార్యదర్శి ఆనంద్,వ్యవసాయ కార్మిక సంఘం టి ఓబులేష్ డైరీలను ఆవిష్కరించారు. ప్రజలకు ఎల్లవేళలా వ్యవసాయ కార్మిక సంఘం అందుబాటులో ఉంటుందని అంతేకాకుండా ప్రజలకు ఏమైనా సమస్యలు ఉంటే వారి సమస్యల పరిష్కారం కోసం అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించే విధంగా కృషి చేస్తామని వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం వడ్డే స్వాములు,భాస్కర్, సురేష్ పాల్గొన్నారు.