PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రసూన లా కాలేజ్ నూతన భవనం ప్రారంభోత్సవం

1 min read

ముందుగా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని తర్వాత మిగతా వాటి కోసం పోరాడాలి .

రాజ్యసభ మాజీ సభ్యులు టీ. జీ. వెంకటేష్ వెల్లడి

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  ఏ ప్రభుత్వంలో అయినా ముందుగా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని మిగతా వాటి కోసం పోరాడాలని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. కర్నూల్ నగరంలో ఏర్పాటుచేసిన ప్రసూన లా కాలేజ్ నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన దత్త విజయానంద తీర్థ స్వామి జీ తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ రాయలసీమలో ఎక్కడా లేనివిధంగా కర్నూల్ నగరంలో న్యాయ కళాశాలను ఏర్పాటు చేసి సొంత భవనం ఏర్పాటు చేయడం అభినందనీయమని చెప్పారు. ఏ ప్రభుత్వంలో అయినా ముందుగా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఆ తరువాత మిగతా అంశాల కోసం పోరాడాలని సూచించారు. తాను రాయలసీమ హక్కుల ఐక్యవేదిక ద్వారా ఈ ప్రాంత అభివృద్ధి కోసం పోరాటం చేశానని వివరించారు. అందరి సహకారంతో సమైక్యాంధ్ర ఉద్యమాన్ని కూడా ముందుకు తీసుకువెళ్లామని వివరించారు. గతంలో రాయలసీమ ప్రాంతంలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేసేందుకు గత ప్రభుత్వం ముందుకు వచ్చిందనివివరించారు. అయితే ఈ ప్రాంతంలో రెండు వర్గాల వాదనలు ఉన్నాయని ఒకవేళ హైకోర్టు బెంచ్ కి ఒప్పుకుంటే హైకోర్టు రాకుండా అడ్డుకున్నారని అపవాదు తనపై వేసే అవకాశం ఉన్న నేపథ్యంలో తాను ఈ అంశానికి దూరంగా ఉన్నట్లు వివరించారు. అయితే ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం హైకోర్టు ఏర్పాటు చేసేందుకు అంగీకరించిందని తద నంతరం హైకోర్టు ఏర్పాటు అంశంపై సుప్రీంకోర్టులో అఫిడవిట్  దాఖలు చేసిందని వివరించారు. ముందుగా ముందుగా చెప్పిన ప్రకారం హైకోర్టు బెంచి ఏర్పాటుకు అంగీకరించి తర్వాత హైకోర్టు కోసం పోరాడి ఉంటే బాగుండేదని ఆయన అభిప్రాయపడ్డారు. కర్నూలు నగర ప్రజల తాగునీటి అవసరాలను తీర్చేందుకు వీలుగా తాను తుంగభద్ర నదిలో చెక్ డాం కం బ్రిడ్జికి 100 కోట్ల రూపాయలతో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మంజూరు చేయించానని. ఇందుకు సంబంధించిన డబ్బులు కూడా బ్యాంకులో  డిపాజిట్ చేయించిన విషయాన్ని గుర్తు చేశారు. అయితే ప్రభుత్వం మారడంతో ఈ ప్రతిపాదన స్థానంలో ఎక్కడో 100 కిలోమీటర్ల దూరం నుంచి పైపులో నీటిని తీసుకువచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారని చెప్పారు .అలా కాకుండా తాను ముందుగా చెప్పిన ప్రకారం చెక్ డాం కం బ్రిడ్జి పనులు పూర్తి చేసి ఉంటే కర్నూలు నగరానికి శాశ్వతంగా తాగునీటి సమస్య పరిష్కారం అయి ఉండేదని, తదనంతరం పైపుల ద్వారా నీటిని తెచ్చుకునే ప్రత్యామ్నాయ మార్గాలను అనుసరించి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. తాను సమైక్యాంధ్ర ఉద్యమం చేసే సమయంలో రాయలసీమలో హైకోర్టు పెట్టాలని, మినీ సచివాలయం నిర్మించాలని, శాసనసభ సమావేశాలను ఇక్కడ కూడా నిర్వహించాలని ప్రతిపాదన చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు .ప్రజలు ఎన్నికల సమయంలో మంచివారిని ఈ ప్రాంత అభివృద్ధి కోసం పాటుపడే వారిని గుర్తించి ఎన్నుకోవాల్సిన అవసరం ఉందని వివరించారు. వరదల వంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చిన సమయంలో ప్రజలు సురక్షితంగా బయటపడింది వీళ్లుగా రింగ్ రోడ్డు నిర్మాణానికి తాను శ్రీకారం చుట్టానని అయితే ప్రభుత్వం మారడంతో ఆ పనులు మధ్యలో ఆగిపోయాయని చెప్పారు. ఈ సందర్భంగా స్వంత భవనం ఏర్పాటుచేసిన ప్రసూన లా కళాశాల యాజమాన్యాన్ని ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధినేతలు వంకి ప్రసూన, డాక్టర్ పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు.

About Author