PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రవీంద్రా మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో స్పీక్ ఈజీ క్లబ్ ప్రారంభోత్సవం

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:   స్థానిక రవీంద్రా మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో స్పీక్ ఈజీ క్లబ్ ప్రారంభోత కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ఏం ఎస్ ఏం ఎఫ్ మరి రవీంద్రా మహిళా ఇంజనీరింగ్ కళాశాల ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమా ముఖ్య అతిధులుగా కేంబ్రిడ్జి యూనివర్సిటీ ప్రెస్ అండ్ అసెస్మెంట్ సౌత్ ఆసియ హెడ్ శ్రీ సురేష్ నారాయణన్ మరియు కేంబ్రిడ్జి యూనివర్సిటీ ప్రెస్ అండ్ అసెస్మె టెర్రిటరీ మేనేజర్, ఆంధ్ర ప్రదేశ్ శ్రీ మల్లికార్జున నాయుడు విచ్చేసారు. కేంద్రీ యూనివర్సిటీ ప్రెస్ అండ్ అసెస్మెంట్ పరీక్షా విధానం మరియు సర్టిఫికేషన్  యొక్క ప్రాముఖ్యతను గురించి వక్తలు తమ ప్రసంగంలో విద్యార్థిని విద్యార్థినులకు వివరించా కళాశాల చైర్మన్ శ్రీ జి. వీ.యం. మోహన్ కుమార్ మాట్లాడుత్యూ పుల్లయ్య మరియు రవీంద్ర మహిళా ఇంజనీరింగ్ కళాశాలలకు చెందిన 350 విద్యార్థిని విద్యార్థినులు సర్టిఫికేషన్ సాధించడం పట్ల తమ హర్షం వ్యక్తం చేసారు. ఈ సర్టిఫికేషన్ వల్ల కలుగు బహు ప్రయోజనాలను ద్రుష్టి లో ఉంచుకొని అధిక సంఖ్యలో విద్యార్థులు పరీక్షను వ్రాయాలని సూచించారు. ఈ సందర్భంగా కళాశాలలో ప్రారంభించిన స్పీక్ ఈజీ క్లబ్ యొక్క ఆక్టివిట్ లో విద్యార్థులు పాలుపంచుకోవాలని తెలిపారు. ఇంతటి ఘనత సాధించిన ఏం ఎస్ ఏ ఎఫ్ టీం ను ప్రత్యేకంగా అభినందించారు. కళాశాల ప్రిన్సిపాల్ డా. కే.ఈ. శ్రీనివాస మూ సర్టిఫికేషన్ పూర్తి చేసుకున్న స్టూడెంట్స్ ని అభినందించారు. కార్యక్రమంలో వివి విభాగాధిపతులు, అధ్యాపకులు మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

About Author