టిడిపి నుండి వైసీపీలో 45 కుటుంబాల చేరిక
1 min readపార్టీ కండువాలు కప్పి సాధా రంగా ఆహ్వానించిన ఎమ్మెల్యే పోచం రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి
పల్లెవెలుగు వెబ్ చెన్నూరు: మండలంలోని కొండపేట గ్రామానికి చెందిన మాజీ ఉప సర్పంచ్ గుడిపాటి రాజేష్ తో పాటు అలాగే ఎస్సీ కాలనీకి చెందిన15 కుటుంబాలు శుక్రవారం టిడిపిని వీడి వైఎస్ఆర్సిపి లో చేరాయి మీరందరికి ఎమ్మెల్యే పోచం రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి పార్టీ కండువా వేసి పార్టీలోనికి సాధారంగా ఆహ్వానించారు, అదేవిధంగా చెన్నూరు తూర్పుగోదావరి జిల్లా వాడ కు చెందిన 30 కుటుంబాలు టిడిపిని వీడి ఎమ్మెల్యే పోచం రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్సిపి లో చేరడం జరిగింది, పార్టీలో చేరిన వారందరికీ ఎమ్మెల్యే పోచం రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి పార్టీ కండువా కప్పి పార్టీలోనికి ఆహ్వానించారు, ఈ సందర్భంగా ఎమ్మెల్యే పోచం రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ, అన్ని వయసుల వారు, అన్ని వర్గాల వారు, అన్ని పార్టీలకు సంబంధించిన వారు కూడా వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న సంక్షేమ పథకాలు అభివృద్ధి చూసి పార్టీకి ఆకర్షితులై నేడు పార్టీలో చేరడం జరుగుతుందన్నారు, అంతేకాకుండా బడుగు బలహీన వర్గాల లక్ష్యంగా వారి అభివృద్ధి కొరకు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న కృషి నేడు అన్ని వర్గాలు నమ్మి ఉన్నాయి కాబట్టి వైఎస్ఆర్ సీపీకి బ్రహ్మరథం పడుతున్నారని ఆయన అన్నారు, ఈ సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి వైసీపీకి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కి అవకాశం ఇస్తే 40 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే అర్హత కలిగిన వ్యక్తి వైయస్ జగన్మోహన్ రెడ్డి అని ఆయన అన్నారు, ప్రతి ఒక్కరూ పార్టీ కోసం ఈ రెండు రోజులు పని చేస్తే రాష్ట్ర అభివృద్ధికి తమ వంతు భాగ్యస్వామ్యులు అవుతారని ఆయన తెలియజేశారు, వైసీపీ ప్రభుత్వానికి వస్తున్న ఆదరణను చూడలేక ఈ పచ్చ నాయకులు ప్రభుత్వంపై అవాకులు చివాకులు పేలుతున్నారని అలాంటి వారందరికీ కూడా మనం ఓటుతో బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన పార్టీలో చేరిన వారికి తెలిపారు, ఈ కార్యక్రమంలో వైయస్సార్ సిపి జిల్లా ఉపాధ్యక్షులు గుమ్మా రాజేంద్ర ప్రసాద్ రెడ్డి, ఎంపీపీ చీర్ల సురేష్ యాదవ్, వైఎస్ఆర్సిపి మండల కన్వీనర్ జి ఎన్ భాస్కర్ రెడ్డి, సర్పంచ్ తుంగ చంద్రశేఖర్ యాదవ్, ఎంపీటీసీ నాగిరెడ్డి, వైఎస్ఆర్సిపి టౌన్ కన్వీనర్ ముదిరెడ్డి సుబ్బారెడ్డి, రాజేష్, అన్వర్ భాష, హస్రత్,, వారిష్, భాష, చౌరయ్య, వెంకటసుబ్బయ్య, పుల్లయ్య, గంగయ్య, వైయస్సార్ సిపి నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.