PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అందరినీ కలుపుకొని..గ్రామాల అభివృద్ధి

1 min read

నిర్వీర్యమైన పంచాయితీలకు పూర్వవైభం

పీఎంఏవై గృహాల ప్రారంభం

పారిశుద్ధ్య కార్మికులకు దుస్తుల పంపిణీ

కడుమూర్ స్వచ్ఛత హీ సేవలో నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య..

పల్లెవెలుగు వెబ్ మిడుతూరు (నందికొట్కూరు): గ్రామాల్లో ఉన్న ప్రతి ఒక్కరినీ కలుపుకుని గ్రామాలను అభివృద్ధి పథాన నడిపిస్తామని నంద్యాల జిల్లా నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య అన్నారు. మంగళవారం మిడుతూరు మండల పరిధిలోని కడుమూరులో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.మ 1 గం.కు గ్రామంలో నూతనంగా నిర్మించిన ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ఇండ్లను ఎమ్మెల్యే ప్రారంభించారు.పీఎంఏవై నూతన గృహాల మంజూరు పత్రాలను పంపిణీ తడి పొడి చెత్త డబ్బాలను పంపిణీ చేశారు.గ్రామ సెంటర్ దేవాలయం దగ్గర విద్యార్థులతో కలిసి స్వచ్ఛత హీ సేవ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఏడు మంది పారిశుద్ధ్య కార్మికులకు డ్రెస్ కోడ్ మరియు వస్తువులను ఎమ్మెల్యే మాండ్ర సురేంద్ర నాథరెడ్డి వారికి అందజేశారు. గ్రామ ఆరోగ్య అద్దె కేంద్రం పూర్తిగా పడిపోయింది వర్షం పడితే నీళ్లల్లోనే గర్భవతులకు బాలింతలకు చికిత్సలు అందిస్తున్నామని గతంలో ఎన్నోసార్లు ప్రజా ప్రతినిధులకు చెప్పినా ఫలితం లేదని ఏఎన్ఎం కళ్యాణి ఆశా కార్యకర్తలు లక్ష్మీదేవి,అనిత, ప్రభావతి ఎమ్మెల్యేకు వివరించారు.అనంతరం ఎమ్మెల్యే జయసూర్య పాత్రికేయులతో మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో గ్రామ పంచాయతీలు నిర్వీర్యం అయ్యాయని పంచాయతీలకు పూర్వ వైభవం తీసుకొస్తున్నామని గత ప్రభుత్వంలో పంచాయతీల్లో రాత్రి డబ్బులు పడితే తెల్లారే లోపు డబ్బులు వెనక్కి తీసుకునేదని వాటి వల్ల గ్రామాలు అభివృద్ధి చెందలేదన్నారు.కూటమి ప్రభుత్వం వచ్చాక సర్పంచ్ ల కు 15వ ఆర్థిక సంఘం నిధులు ఉపాధి హామీ మరియు మిగతా నిధుల ద్వారా గ్రామాలను అభివృద్ధి చేస్తామని పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేస్తామని ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ ముందుకు వెళ్తామని రాష్ట్రమంతా ఒకేరోజు గ్రామ ఉపాధి సభలు జరగడంతో రాష్ట్రానికి ప్రపంచ అవార్డు రావడం హర్షించదగ్గ విషయమని ఎమ్మెల్యే అన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో జిఎన్ఎస్ రెడ్డి, మండల కన్వీనర్ కాత రమేష్ రెడ్డి,వంగాల శివరామిరెడ్డి, సర్పంచ్ జీవరత్నం,ఈఓఆర్డి ఫక్రుద్దీన్,హౌసింగ్ ఏఈ భాస్కర్,ఎంఈఓ శ్రీనాథ్,గ్రామ టిడిపి నాయకులు సుధాకర్ రెడ్డి,ఇద్రిస్,మగ్బుల్ అహమ్మద్,సల్కోటి గోవర్ధన్ రెడ్డి,హరి సర్వోత్తమ్ రెడ్డి, నందికొట్కూర్ జమీల్, వీరారెడ్డి,నాగేంద్రుడు,చాకర్ వలి,సర్వోత్తమ్ రెడ్డి, వెంకటేశ్వర రెడ్డి,శ్రీనివాసరెడ్డి, వెంకటేశ్వర్లు,నరసింహ గౌడ్,గోకారి,పిఎస్ శివకళ్యాణ్ సింగ్,ఈఏ రమేష్ పాల్గొన్నారు.

About Author