కోట్లలో ఆదాయం.. కనీస సౌకర్యాలు కరువు..
1 min readపల్లెవెలుగు వెబ్ కౌతాళం : జిల్లాలో ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రాలలో ఒకటైన శ్రీనరసింహ ఉరుకుంద ఈరన్న స్వామి శ్రావణ మాస ఉత్సవాలు సోమవారం ప్రారంభం అయ్యింది.ఈ నెల 5 నుండి సెప్టెంబర్ 3 వరకు నెలరోజుల పాటు అత్యంత వైభవంగా ఉత్సవాలు నిర్వహిస్తారు.నెల రోజులు పాటు జరిగే ఉత్సవాలలో భక్తులు కొలిచేవారికి కొంగు బంగారం గా మొక్కులు తీర్చుకుంటారు.దక్షిణాది రాష్ట్రాల నుండి సుమారు 20 లక్షలకు పైగా సందర్శకులు పాల్గొంటారు. తుంగభద్ర దిగువలో భక్తులు పుణ్య స్థానాలు ఆదరించి స్వామివారికి ఇష్టమైన నైవేద్యాన్ని తడి గుడ్డలతోనే వండుతారు.కొంతమంది భక్తులు తమ తలనీలాలు సమర్పించి మొక్కుబడులు తీర్చుకుంటారు.పుణ్యక్షేత్రానికి కర్ణాటక,తెలంగాణ,ఆంధ్ర, పలు గ్రామాలు నుంచి భక్తులు తరలి వస్తారు. కోట్లలో ఆదాయం.. కనీస సౌకర్యాలు కరువు..పూర్తికాని ఏర్పాట్లుశ్రీ నరసింహ ఉరుకుంద ఈరన్న స్వామి పుణ్యక్షేత్రానికి భక్తుల ద్వారా కోట్లలో ఆదాయం సమకూరుతుంది. స్వామివారి దర్శనం కోసం వివిధ ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు కనీస సౌకర్యాలు కరువయ్యాయి. శ్రావణ మాస ఉత్సవాలు ప్రారంభం అవుతున్నా ఏర్పాట్లు పూర్తి కాకపోవడం పట్ల భక్తులు విమర్శిస్తున్నారు.తాగునీరు స్వామి వారి దర్శనం కోసం లక్షలాదిమంది భక్తులు తరలి వస్తారు. భక్తుల కోసం శాశ్వతంగా నీటి సౌకర్యం కల్పించడంలో అధికారులు పూర్తిగా విఫలమవుతున్నారు.కనీసం తాగడానికి తాగునీరు అందని పరిస్థితిలో పుణ్యక్షేత్రం ఉండడంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఉత్సవాలలో తాగునీటి కోసం ప్రజలు కష్టాలు తప్పడం లేదు.డబ్బులు పెట్టి తాగడానికి నీరు కొనుగోలు ఈ చేయాల్సిందే.మరుగుదొడ్ల సౌకర్యం లేదు: శ్రావణమాస ఉత్సవాలలో పాల్గొనే భక్తులకు మరుగుదొడ్ల సౌకర్యం లేదు.