పవర్ గ్రిడ్ పోల్స్ నష్టపరిహారం పెంచాలని రైతుల వినతి
1 min readనంద్యాల ఆర్డీవో మల్లికార్జున్ రెడ్డి క్షేత్రస్థాయి పర్యటన
పల్లెవెలుగు వెబ్ గడివేముల : గడివేముల మండల కేంద్రంలోని బు. చిందుకూరు. గ్రంధి వేముల .గ్రామాలలో పవర్ గ్రిడ్ ఏర్పాటు చేస్తున్న విద్యుత్ లైన్ కు కావలసిన భూమి పరిహారం విషయంలో పవర్ గ్రిడ్ అధికారులు రైతుల మధ్య సమన్వయం కుదరకపోవడంతో గ్రంధివేములకు చెందిన రైతులు కోర్టుకు వెళ్లడం పవర్ గ్రిడ్ సంస్థకు అనుకూలంగా కోర్టు తీర్పు ఇచ్చి స్థానికంగా అక్కడే సమస్యను పరిష్కరించుకోవాలని ఆదేశాలు జారీ చేయడంతో గురువారం నాడు నంద్యాల ఆర్డీవో మల్లికార్జున్రెడ్డి రైతులతో మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా రైతులు తమకు ఇచ్చే పరిహారం విషయంలో కొద్దిగా పెంచి ఇవ్వాలని కోరగా ప్రభుత్వ ఆదేశాల మేరకు స్థానికంగా ఉన్న మార్కెట్ రేటును బట్టి పరిహారం ఇస్తామని పనులను అడ్డుకోవద్దని రైతులకు తెలిపారు ఈ సందర్భంగా స్థానికంగా రైతుల పొలాల్లో సందర్శించి మార్కెట్ రేటు ప్రకారమే ధర ఇస్తామని పవర్ గ్రిడ్ లైన్ వెళ్లే ప్రాంతంలో పంట నష్టపోతే నష్టపరిహారం ఇస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో తాసిల్దార్ జమానుల్లా ఖాన్. మండల సర్వేయర్ శివ ప్రసాద్ . ఆర్ఐ ఎల్ల సుబ్బయ్య.. రైతులు పాల్గొన్నారు.