విద్యుత్ చార్జీల పెంపు సరికాదు : సీపీఎం
1 min readఎన్నికల ముందు ప్రజలను నమ్మించారు
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: విద్యుత్ చార్జీల పెంపుదలను ప్రభుత్వం వెంటనే ఉపసరించుకోవాలని సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం.నాగేశ్వరావు అన్నారు.గురువారం నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణం పొట్టి శ్రీరాములు విగ్రహం దగ్గర విద్యుత్ ఛార్జీల పెంపుదలను నిరసిస్తూ కరెంట్ బిల్లులను దగ్ధం చేయడం చేశారు.ఈ సందర్భంగా నాగేశ్వరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు అధికారం కోసం ప్రజలను నమ్మించడానికి విద్యుత్ చార్జీలు ఐదు సంవత్సరాలు పెంచబోమని రాష్ట్రంలో స్మార్ట్ మీటర్లు బిగిస్తే పగలగొడతామని ధ్వంసం చేస్తామని చంద్రబాబు,లోకేష్ ప్రజా వేదికల మీద చెప్పారని నేడు వాటికి విరుద్ధంగా రాష్ట్ర ప్రజలపై లక్ష కోట్లు విద్యుత్తు చార్జీల భారాన్ని మోపబోతున్నారని ఆరోపించారు.విద్యుత్తు ట్రూ అప్ చార్జీలు సర్దుబాటు చార్జీలు ఎలక్ట్రిసిటీ డ్యూటీ చార్జీల పేరుతో అసలు కంటే కొసరు ఎక్కువ వేస్తున్నారని వారు ఆరోపించారు.కేంద్రంలో నరేంద్ర మోడీ,రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఆదానీతో చేసుకున్న ఒప్పందాలు మూలంగా జగన్మోహన్ రెడ్డి 1750 కోట్లు ముడుపులు చెల్లించినట్లు అమెరికాలో కేసు నమోదు అయిందని వారు తెలిపారు.ఇప్పటికే రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక ఆత్మహత్యలు చేసుకుంటే మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం రైతు బోర్లకు స్మార్ట్ మీటర్లు బిగించి రైతు మెడలకు ఉరితాడు బిగించబోతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు బేస్తరాజు,సి నాగన్న,ఉస్మాన్ భాష, కార్పెంటర్ అబ్దుల్ రషీద్, బోయ నాయుడు బి బాలస్వామి పాల్గొన్నారు.