అలాయాలలో దూపా ధీప నైవేద్యల ఖర్చు పెంపు పై హర్షం
1 min readఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు కి ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో కమిటీకి ప్రైవేట్ దేవాలయాల్లో పనిచేసే అర్చకులకు వేతనం పదివేల రూపాయలు చేయాలని, చాలీచాలని జీతాలతో జీవనం సాగిస్తున్న ప్రైవేటు దేవాలయ అర్చకులకు వారి దేవాలయాలను గుర్తించి వారికి డిడిఎన్ఎస్ పథకం వర్తింపజేయాలని, అదేవిధంగా అర్చకులు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని అదేవిధంగా అర్చకత్వం పౌరోహిత్యం చేస్తున్నటువంటి బ్రాహ్మణులను కులవృత్తిగా గుర్తించాలని కోరడం జరిగింది. ఐదువేల రూపాయలు ఇచ్చే డిడిఎన్ఎస్ పథకాన్ని 10 వేల రూపాయల పెంచుతూ దేవాదాయ శాఖ మంత్రివర్యులు ఆ ఫైల్ పై సంతకం చేయడం. అదేవిధంగా ఈరోజున ప్రైవేట్ దేవాలయాలను గుర్తిస్తూ ప్రభుత్వం జీవో తీసుకురావడం చాలా హర్షనీయమైనటువంటి విషయము కావున మేము ఎన్నో సంవత్సరాలుగా వెదురుచూస్తున్నటువంటి, పోరాటం చేస్తున్నటువంటి ముఖ్యమైనటువంటి వాటిని ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా సాధికార సమితి వారికి కూడా మా యొక్క హార్దిక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము,