మిడుతూరులో ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు..
1 min readపల్లెవెలుగు వెబ్ మిడుతూరు (నందికొట్కూరు): నంద్యాల జిల్లా మిడుతూరు మండలంలో ని మండల కార్యాలయాలు మరియు అన్ని గ్రామాల్లో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి.తహసిల్దార్ కార్యాలయంలో తహసిల్దార్ పి శ్రీనివాసులు జెండాను ఎగరవేశారు. మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ మల్లు వెంకటేశ్వరమ్మ,మండల వ్యవసాయ శాఖ కార్యాలయంలో టిడిపి మండల కన్వీనర్ కాత రమేష్ రెడ్డి,ఎంఏఓ పీరు నాయక్ జెండాను ఎగురవేశారు. మోడల్ పాఠశాల,జిల్లా పరిషత్ పాఠశాలల్లో జరిగే వేడుకల్లో కా తా రమేష్ రెడ్డి,ఉప సర్పంచ్ తువ్వా లోకేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.పోలీస్ స్టేషన్ లో ఎస్సై జగన్మోహన్,కస్తూర్బా లో ఎస్ఓ విజయలక్ష్మి,విద్యాశాఖ కార్యాలయంలో ఎంఈఓ రామిరెడ్డి,జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాల్ శంకర్ నాయక్ అదేవిధంగా వివిధ గ్రామాల్లో మండల జిల్లా పరిషత్ పాఠశాలల్లో జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం ఆటల పోటీలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రవధానం చేశారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో జిఎన్ఎస్ రెడ్డి,ఈవో ఆర్డీ ఫక్రుద్దీన్,డిప్యూటీ తహసిల్దార్ షాన్వాజ్,సర్వే డీటీ సుప్రియ,ఏఎస్ఐ సుబ్బయ్య వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు అధికారులు పాల్గొన్నారు.