ఏపిజిబి ప్రాంతీయ కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు ప్రాంతీయ కార్యాలయం లో రీజినల్ మేనేజర్ శ్రీ PS నవీన్ అధ్యక్షన 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అట్టహసం గా జరిగాయి,. ఈ కార్యక్రమం లో విశ్రాంత ఉద్యోగులు కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు.. ఈ సందర్బంగా రీజినల్ మేనేజర్ శ్రీ నవీన్ మాట్లాడుతూ మనము ఇప్పుడు అనుభవిస్తున్న ఈ స్వాతంత్ర్య ఫలాలు మన పూర్వికుల త్యాగం, శ్రమ వలన లభించాయిని, అలాంటి జాతియోధ్యమ నాయకులని మనం స్మరించు కోవడం మన బాధ్యత అనీ, పేర్కొన్నారు., అలాగే ఈ సమావేశం విశిష్టత గురుంచి మిగతా ఉద్యోగులు వారి మాటల్లో వివరించారు., అనంతరం, బ్యాంకు నిర్వహించిన వివిధ రకాల పోటీలలో గెలుపొందిన వారికి ప్రతేక బహుమతులతో సన్మానిచడం జరిగింది.