భారతీయ సంస్కృతి అన్ని సంస్కృతులకు మాతృక
1 min readడాక్టర్ మల్లు వేంకటరెడ్డి, తితిదే.
ఘనంగా ముగిసిన తితిదే ధార్మిక కార్యక్రమాలు
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: ప్రపంచంలోని అన్ని సంస్కృతులకు మాతృక భారతీయ సంస్కృతి అని, అటువంటి భారతీయ సంస్కృతిని కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అందరూ ఆచరించడమంటే దేశ ప్రతిష్టను పెంచడమే నని తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వేంకటరెడ్డి అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆదోని పట్టణం, మేదరగేరిలో వెలసిన శ్రీ మల్లాలమ్మ దేవస్థానం నందు గత నాలుగు రోజులుగా జరుగుతున్న ధార్మిక, ఆధ్యాత్మిక , సాంస్కృతిక కార్యక్రమాలు శుక్రవారం కుంకుమార్చన కార్యక్రమంతో ముగిశాయి. ఈ సందర్భంగా జరిగిన ధార్మిక సభా కార్యక్రమంలో పలువురు ధార్మిక ప్రముఖులు ప్రసంగించారు. మూడు రోజులపాటు శ్రీమద్రామాయణం మహాభారతం భగవద్గీతలపై గీతాప్రచారకులు యం. నాగరాజు స్వామి చేసిన ధార్మిక ప్రవచనాలు భక్తులను ఎంతగానో అలరించాయి. ఈ కార్యక్రమంలో తితిదే ధర్మ ప్రచార మండలి సభ్యులు ఎన్.భీమిరెడ్డి, మల్లాలమ్మ ఆలయ కమిటీ నిర్వాహకులు తిరుమలేశ్, యం.ఎస్. రాజు, యం.బి.బాబు, యుం.బి.రఘు, యం.ఎస్.రఘు, యం.ఎస్. బాబు, యం.బి. నరేశ్, రామాంజనేయులు, తిమ్మప్ప, రాజు ధర్మ ప్రచారకులు మహేశ్ శర్మ, సీతారాములు, సత్యనారాయణ, హరిసర్వోత్తమ రెడ్డి, సోమిరెడ్డి, భీమలింగేశ్వర రెడ్డి, వి.హిం.ప. మహిళా మండలి ప్రముఖులు రాధారెడ్డి, అరుణా రెడ్డి, లలితమ్మ, లక్ష్మీ, అనుపమ, నాగరత్నమ్మతో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.