భారతదేశ సైనిక దళాల కోసం స్వదేశీ రూపకల్పన
1 min readపల్లెవెలుగు వెబ్ హైదరాబాద్: భారతదేశ సైనిక దళాల కోసం స్వదేశీ రూపకల్పన, అభివృద్ధి మరియు తయారీ సామర్థ్యాలను ప్రోత్సహించే మేక్ ఇన్ ఇండియా మరియు ఇండియన్ డిజైన్ డెవలప్మెంట్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ కార్యక్రమాల కింద, స్కాన్‌పాయింట్ జియోమెటిక్స్ లిమిటెడ్ ను భారత సాయుధ దళాల నుండి ఒక ప్రాజెక్ట్ కోసం షార్ట్‌లిస్ట్ చేశారు. ఈ సంస్థ SAC-ISRO తో కలిసి స్వదేశీ జియోస్పేషియల్ సాఫ్ట్‌వేర్ ఐజిఐఎస్ (ఇంటిగ్రేటెడ్ జిఐఎస్ మరియు ఇమేజ్ ప్రాసెసింగ్ సాఫ్ట్‌వేర్) రూపకల్పన మరియు అభివృద్ధిలో నిమగ్నమై ఉంది.ఇదిలా ఉండగా, ఎఫ్ వై25 మొదటి త్రైమాసికంలో కంపెనీ నికర లాభం 104% పెరిగిందని, అలాగే కార్యకలాపాల నుండి వచ్చే ఆదాయం 417% పెరిగిందని ప్రకటించింది. స్వదేశీ శాటిలైట్ ఇమేజ్ ప్రాసెసింగ్ మరియు జిఐసి ఆర్థిక వ్యవస్థలోని ఇతర అవకాశాలను ఉపయోగించుకోవడానికి, సంస్థ కమోడిటీస్, సౌర ప్రాజెక్టులు మరియు ఈపిసి కాంట్రాక్టింగ్ వ్యాపారాల్లోకి ప్రవేశించేందుకు ప్రణాళికలు రచిస్తోంది.