PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపిన ఇందిరమ్మ

1 min read

జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు- పి మురళీ కృష్ణ

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:           శ్రీమతి ఇందిరా గాంధీ నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపారని భారత తొలి మహిళా ప్రధాన మంత్రి, ప్రపంచ ఉక్కుమహిళగా పేరుగాంచిన భారతరత్న శ్రీమతి ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు దేశంలో ప్రతి ఇల్లూ ఆనందంగా ఉండేదని నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపిందని కర్నూలు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే, తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి మాజీ సభ్యులు పి మురళీకృష్ణ ఆమె సేవలను కొనియాడారు. గురువారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో  జరిగిన శ్రీమతి ఇందిరా గాంధీ 40 వ వర్ధంతి మరియు భారత తొలి ఉప ప్రధాని ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 149 వ జయంతి సందర్బంగా వారి చిత్ర పటములకు పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం పి మురళీకృష్ణ మాట్లాడుతూ శ్రీమతి ఇందిరా గాంధీ పాలనలో దేశంలో ప్రజలు ఎంతో సుఖ సంతోషాలతో జీవించారని ఆమె గరీబీ హటావో, బ్యాంకుల జాతీయకరణ, రాజ భరణాల రద్దు, అంటరానితన నిర్మూలన మొదలగు ఎన్నో సాహసోపేత నిర్ణయాలను అమలు పరిచి దేశ ప్రజలను కంటికి రెప్పలా కాపాడిందని ఎన్నో జాతీయ సంస్థలు స్థాపించిందని, నేడు మోడీ ప్రభుత్వంలో దేశప్రజలు పెరిగిన నిత్యావసర ధరలు, వంటగ్యాస్, పెట్రోల్ ధరలతో దేశ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని దేశంలో హత్యలు, అత్యాచారాల నియంత్రణలో మోడీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని నాడు శ్రీమతి ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు ఎన్నో ప్రభుత్వ రంగ సంస్థలను స్థాపించిందని, నేడు ప్రధాని మోదీగారు ప్రభుత్వరంగ సంస్థలను అంబానీ అదానీలకు ప్రైవేట్ పరం చేసి పేదల జీవితాల్లో చీకట్లు నింపుతున్నాడని విమర్శించారు. అలాగే భారత మొదటి ఉపప్రధాని, మొదటి హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ స్వాతంత్య్ర సమరయోధుడుగా, 1931 సంవత్సరంలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ మహా సభకు అధ్యక్షత వహించారని,   సాహసోపేత నిర్ణయాలతో ఐదువందలకు పైగా స్వదేశీ సంస్థానాలను విలీనం చేసి స్వతంత్ర భారతావనిని ఏకం చేసిన ధీశాలి సర్దార్ వల్లభాయి పటేల్ని ఆయన పుట్టిన రోజును జాతీయ ఐక్యతాదినం గా జరుపుకుంటున్నామని  మురళీ కృష్ణ గారు తెలియ జేశారు. అనంతరం మాజీ ఎమ్మెల్సీ ఎం సుధాకర్ బాబు మాట్లాడుతూ శ్రీమతి ఇందిరా గాంధీ పాలన స్వర్ణ యుగంగా చరిత్రలో నిలిచిపోతుందని దేశంలోని పేదలకు ఎన్నో సంక్షేమ పథకాలు అందించి నిరుపేదలకు భూములు, ఇల్లు ఇచ్చిన ఘనత శ్రీమతి ఇందిరా గాంధీ గారిదేనని రాధాకృష్ణ ఆమె చేసిన సేవలను కొనియాడారు. అనంతరం స్థానిక రాజ విహార్ సెంటర్ నందలి శ్రీమతి ఇందిరా గాంధీ కాంస్య విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో  మాజీ ఎమ్మెల్సీ ఎం సుధాకర బాబు, వివిధ పదవులలో కొనసాగిన కాంగ్రెస్ నాయకులు ఎన్సీ బజారన్న, బి బతుకన్న, షేక్ రియాజుద్దీన్, సయ్యద్ నవీద్, కె సత్యనారాయణ గుప్త, ఎస్ ప్రమీల, ఏ వెంకట సుజాత, షేక్ ఖాజా హుస్సేన్, డివి సాంబశివుడు, డబ్ల్యూ సత్యరాజు, ఎం శివానంద్, ఈ లాజరస్, అమనుల్లా, నాగశేషయ్య, అబ్దుల్ హై, సయ్యద్ ముషీద్ పీర్ ఖాద్రి, ఎన్ సుంకన్న, బి సుబ్రహ్మణ్యం, ఆర్ ప్రతాఫ్, పసుపల ప్రతాపరెడ్డి, జోసెఫ్ నోయల్, మిన్నెల్ల హుస్సేన్, రమేష్, కేశవరెడ్డి మొదలగువారు పాల్గొన్నారు.

About Author