PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కర్నూలులో పరిశ్రమల స్థాపనకు కృషి..

1 min read

అభివృద్ధిలో రాజీ ఉండదు…

  • పరిశ్రమలు, వాణిజ్య, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్
  • మంత్రిగా కర్నూలుకు వచ్చిన టీజీ భరత్​
  • గోదా గోకులంలో ప్రత్యేక పూజలు
  • గజమాలతో స్వాగతం పలికిన ప్రజలు
  • హారతి పట్టిన మహిళలు

కర్నూలు, పల్లెవెలుగు:పరిశ్రమల స్థాపనతో రాయలసీమ అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు పరిశ్రమలు, వాణిజ్య, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్. మొదటి సారి ఎమ్మెల్యేగా గెలిచి.. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత కర్నూలుకు వచ్చిన టీజీ భరత్​కు  అభిమానులు, కార్యకర్తలు, ప్రజలు ఘనస్వాగతం పలికారు.   కర్నూలులోని సుంకేసుల రోడ్డులో ఉన్న గోదా గోకులంలో టీజీ భరత్ ప్రత్యేక పూజలు చేశారు. ఆ తరువాత సెయింట్ జోసఫ్ కాలేజీ, మున్సిపల్ ఆఫీస్, ఎస్బీఐ సర్కిల్, గాంధీ నగర్, జిల్లా పరిషత్, రాజ్ విహార్ మీదుగా తెలుగుదేశం పార్టీ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో ఎంపీ నాగరాజు, ఎమ్మెల్యేలు కేఈ శ్యామ్ బాబు, దస్తగిరి, పార్థసారథి,  ఎమ్మెల్సీ బీటీ నాయుడు, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి, మాజీ మంత్రి కేఈ ప్రభాకర్, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు, ఆలూరు ఇంఛార్జీ వీరభద్ర గౌడ్ తదితరులు పాల్గొన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు వేలాదిగా తరలివచ్చి ర్యాలీలో పాల్గొన్నారు. టీడీపీ కార్యాలయం వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి మంత్రి టీజీ భరత్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కర్నూలు జిల్లాలో పరిశ్రమల స్థాపనకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. జిల్లాలో తాగునీటి సమస్యను పరిష్కరిస్తామన్నారు. తనను ఆశీర్వదించిన ప్రజలకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రజల దీవెనలతోనే ఈ స్థాయిలో ఉన్నానన్నారు.

About Author