ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సారథి రాజీవ్ గాంధీ
1 min readజిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కె బాబురావు
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (సమాచార సాంకేతిక విప్లవ) సారథి స్వర్గీయ శ్రీ రాజీవ్ గాంధి గారని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కే బాబురావు కొనియాడారు. ఈరోజు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో భారత మాజీ ప్రధాని స్వర్గీయ శ్రీ రాజీవ్ గాంధీ 80 వ జయంతి వేడుకల సందర్భంగా జరిగిన కార్యక్రమంలో బాబురావు మాట్లాడుతూ కంప్యూటర్, సాంకేతిక టెలీ కమ్యూనికేషన్ల రంగంలో ఆధునిక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో కొత్తపుంతలు తొక్కిన భారత్ ఇవాళ ఆ ఫలితాలను భారత జాతి ఆస్వాదిస్తుందంటే అలాగే నేటి సమాజంలో ప్రతి ఒక్కరికి సెల్ ఫోన్లు అందుబాటులోనికి వచ్చిందంటే అప్పటి ప్రధాని శ్రీ రాజీవ్ గాంధీ కృషి అని ప్రపంచమంతా కంప్యూటర్ యుగంలో దూసుకుపోతున్న వేళ మన దేశంలోనూ సాంకేతిక విప్లవం రావాలని దేశానికి మొట్టమొదటి కంప్యూటర్ ఇవ్వడమే కాకుండా ఆ రంగంలో నూతన శకానికి రాజీవ్ గాంధీ బాటలు వేశారని సైనిక దళాలకు అత్యాధునిక ఆయుధాలు సమకూర్చాలని ఎంతో తపన పడ్డారని మన దేశ ఆర్థిక వ్యవస్థలో సంస్కరణలకు ఆయన చేసిన ప్రయత్నాన్ని మేధావులు సైతం ప్రశంసించారని, 18 సంవత్సరాలు నిండిన యువతకు ఓటు హక్కు కల్పించిన ఘనత రాజీవ్ గాంధీ కే దక్కుతుందని గ్రామీణభివృద్ధి, కంప్యూటర్ రంగాన్ని అభివృద్ధి చేసి దేశాన్ని సాంకేతికంగా ముందుకు తీసుకు వెళ్లిన వ్యక్తి రాజీవ్ గాంధీ నీ, పారిశ్రామిక రంగంలో పన్ను తగ్గింపు విధానాన్ని అవలంభించి, రక్షణ, విమానయాన, వాణిజ్య రంగాలు అభివృద్ధి చెందడానికి కారణం రాజీవ్ గాంధీ ని ఈ విధానం వలన ఆధునిక ఆర్థిక విధానం వలన విదేశి పెట్టుబడులను ఆకర్షించి పెట్టుబడులకు భారత్ ని స్వర్గధామం చేసిన ఘనత రాజీవ్ గాంధీనీ 1986 లో న్యూ నేషనల్ పాలసీ ఫర్ ఎడ్యుకేషన్ ప్రవేశపెట్టిన ఘనత రాజీవ్ గాంధీ గారికే దక్కుతుందనీ ఈ పాలసీ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఎంతో తోడ్పడిందని నవోదయ పాఠశాలలు స్థాపించి విద్యలో ఒక గొప్ప మార్పుకు కారణమైన వ్యక్తి రాజీవ్ గాంధీ 1987లో బ్లాక్ బోర్డు ఆపరేషన్,1985 లో ఇందిరాగాంధీ ఓపెన్ యూనివర్సిటీ, నవోదయ స్కూల్స్ వీటి వల్ల గ్రామీణ ప్రాంతాలలో నివసించే పిల్లలు విద్యావంతులుగా అవడానికి కారణమైన వ్యక్తి రాజీవ్ గాంధీనీ బాబురావు రాజీవ్ గాంధి సేవలను కొనియాడారు. ముందుగా పార్టీ కార్యాలయంలో శ్రీ రాజీవ్ గాంధీ చిత్ర పటమునకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కార్యకర్తల సమావేశం జరిగినది. అనంతరం స్థానిక సి క్యాంపు సెంటర్ నందలి శ్రీ రాజీవ్ గాంధీ గారి కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళు లర్పించారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ఎం సుధాకర్ బాబు మాజీ ఎమ్మెల్యే పరిగెల మురళీకృష్ణ పీసీసీ ప్రధాన కార్యదర్శి దామోదరం రాధాకృష్ణ కర్నూల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి షేక్ జిలాని భాష కోఆర్డినేషన్ చైర్మన్ అనంత రత్నం, డిసిసి ఉపాధ్యక్షులు బి బతుకన్న, రియాజుద్దీన్ డిసిసి ప్రధాన కార్యదర్శులు పోతుల శేఖర్ సయ్యద్ నవీద్, ఎన్ చంద్రశేఖర్ మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు ఎస్ ప్రమీల జిల్లా కాంగ్రెస్ మీడియా చైర్మన్ అమనుల్లా సిటీ మైనార్టీ సెల్ చైర్మన్ షేక్ ఖాజా హుస్సేన్, ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్సీ బజారన్న, మైనార్టీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్ ముర్షిద్ పీర్ ఖాద్రి, ఎస్సీ సెల్ డబ్ల్యూ సత్యరాజు డిసిసి కార్యదర్శులు బి సుబ్రహ్మణ్యం, అబ్దుల్ హై కాంగ్రెస్ నాయకులు షేక్ మాలిక్ భాష, ఆర్ విక్టర్ జయకుమార్ జాన్ సదానందం, వశీ భాష ఐఎన్టియుసి నాయకులు మద్దిలేటి, జేమ్స్, ఆనందం మహిళా కాంగ్రెస్ కె వెంకటలక్ష్మి మొదలు పాల్గొన్నారు.