ఇంగలదహల్ స్కూల్ కాంప్లెక్స్ ను కొనసాగించాలంటూ వినతి
1 min readపల్లెవెలుగు వెబ్ హొళగుంద: హోళగుందఇంగలదహల్ గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల యొక్క కాంప్లెక్స్ ను యథావిధిగా కొనసాగించాలి అని కర్నూలుకు వచ్చిన రాష్ట్రా విద్యా కమిషనర్ సురేష్ కి మరియు జిల్లా విద్యా శాఖ అధికారి శ్యాముల్ కి వినతి పత్రం అందజేశాము అని ఎంపీటీసీ మల్లికార్జున ఇంగలదహల్ సర్పంచ్ భర్త వెంకటరామిరెడ్డి గ్రామ పెద్దలు శ్రీకాంత్ రెడ్డి స్కూల్ విద్యా కమిటీ చైర్మన్ ఉరుకుందు యూత్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు. వారు పాఠశాల యొక్క స్థితి గతులను విద్యా కమిషన్ కి తెలియజేశారు.స్పందించిన విద్యాశాఖ అధికారులు కాంప్లెక్స్ ల విషయాలను పరిశీలించి అందరి అభిప్రాయాల మేరకు నిర్ణయాలు తీసుకుంటామని తెలియజేశారు. కాంప్లెక్స్ లను తొలగింపున పునఃపరిశీలన చేస్తామని చేసి కాంప్లెక్స్ లను తొలగించము అని హామీ ఇచ్చారన్నారు.ఈ కార్యక్రమంలో ఇంగలదహల్,ఎం.డి.హళ్లి,పెద్ద గోనెహాల్ గ్రామ పెద్దలు యూత్ సభ్యులు విరేష్, శేఖర్,సుభన్, హనుమంతు,రాజు,పంపాపతి, మల్లికార్జున, ఇబ్రహీం, శివ,నాగరాజు పాల్గొన్నారు.