కర్నూలు శ్రీ బీర లింగేశ్వర దేవాలయం పరిశీలించిన మంత్రి సవితమ్మ
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు జిల్లా కేంద్రంలోని పెద్దపాడు రోడ్ లోని ఏపీ మోడల్ స్కూల్ సమీపమున గల శ్రీ బీర లింగేశ్వర స్వామి దేవాలయాన్ని పరిశీలించిన బీసీ సంక్షేమ మంత్రి సవితమ్మ,కర్నూలు పార్లమెంట్ సభ్యులు బస్తిపాటి నాగరాజు శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి సవితమ్మ మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో ఇంత పెద్ద దేవాలయాన్ని నిర్మించడం గర్వకారణమని, కర్నూలు జిల్లా కురవ సంఘం కమిటీ సభ్యులను అభినందించారు. అలాగే నా వంతు సహకారంగా ఈ గుడి నిర్మాణానికి కమ్యూనిటీ హాల్ కు పూర్తిస్థాయిలో సహకారం అందిస్తానని తెలిపారు. కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు మాట్లాడుతూ గుడి నిర్మాణానికి నా వంతు సహకారంగా పది లక్షల రూపాయలు ఇస్తూ మరి ఏదైనా అవసరమైతే వచ్చే కార్తీక వనభోజనాల్లోపు పూర్తిస్థాయిలో నిర్మాణానికి నా వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు.స్థల దాత పాల సుంకన్న ని మంత్రి సవితమ్మ శాలువా, పూలమాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో కర్నూలు జిల్లా కురువ సంఘం జిల్లా అధ్యక్షులు పత్తికొండ శ్రీనివాసులు,జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. కె.రంగస్వామి జిల్లా ఉపాధ్యక్షులు బి. వెంకటేశ్వర్లు, పెద్దపాడు ధనుంజయ, కోశాధికారి కె. సి.నాగన్న కె. గణేష్ మహిళా సంఘం అధ్యక్షురాలు శ్రీ లీల, ప్రధాన కార్యదర్శి కె. అనిత,కె హరిదాసు, వీరన్న, కె క్రిష్ణ, శ్రీనివాస్, రామకృష్ణ, కె.నాగయ్య అల్లూరు వెంకటేష్, పెద్ద బీచుపల్లి తదితరులు పాల్గొన్నారు.