ఏపీ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల” తనిఖి
1 min readనంద్యాల జిల్లా అధ్యక్షులు మరియు పాణ్యం మాజీ ఎమ్మెల్యే శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి …!!!
పల్లెవెలుగు వెబ్ నంద్యాల: నంద్యాల జిల్లా : పాణ్యం నియోజకవర్గం : పాణ్యం టౌన్ లోని ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల (బాలురు) పాఠశాలను తనికి చేసిన కాటసాని రాంభూపాల్ రెడ్డి .. అక్కడి పరిస్థితులను ప్రిన్సిపాల్ కృష్ణ నాయక్ ను అడిగి తెలుసుకున్నారు.. ఔట్సోర్సింగ్ ఉపాధ్యాయులు ఉద్యోగ భద్రత కల్పియాలని కోరుతూ 45 రోజులుగా సమ్మె చేస్తున్నారు.. గిరిజన పాఠశాల ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించడం లేదు కూటమి ప్రభుత్వం.. దీనివలన పదవ తరగతి ఇతర తరగతులు విద్యార్థులకు బోధనలు చెప్పే ఉపాధ్యాయులు లేరు.. వచ్చే పదవ తరగతి పరీక్షల్లో ఎలా ఉత్తీర్ణులు సాధిస్తారు.. ప్రభుత్వం నిజమైన డిమాండ్లు ఉపాధ్యాయులకు పరిష్కరించి విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చేయాలని కోరారు. ప్రస్తుతం బాలుర పాఠశాలకు ఇద్దరు వాలంటీర్లను ఏర్పాటు గ్రీన్ కో వాళ్లతో మాట్లాడి కృషి చేస్తా అని నంద్యాల జిల్లా అధ్యక్షులు మరియు పాణ్యం మాజీ ఎమ్మెల్యే శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి అన్నారు.