విత్తన దుకాణాల తనిఖీ.. అధిక ధరకు విక్రయిస్తే చర్యలు .. ఏడిఏ ఆంజనేయులు
1 min readపల్లెవెలుగు న్యూస్ గడివేముల : మండలంలోని విత్తన దుకాణాలను ఆత్మకూరు ఏ డి ఏ ఆంజనేయులు జిల్లా అంతర్గత విత్తన తనిఖీలలో భాగంగా బుధవారం నాడు విత్తన కేంద్రాలను తనిఖీ చేశారు. ఇందులో మొక్కజొన్న, కంది, పత్తి విత్తనాలకు సంబంధించి స్టాకు బోర్డు, బిల్లులు, స్టాక్ రిజిస్టర్స్ తనిఖీ చేశారు.తదుపరి విత్తన విక్రయిదారులు .
స్టాక్ బోర్డు, ధరల పట్టిక సూచిని రైతులకు కనబడేటట్లుగా ఉంచాలని మరియు నిల్వలను విక్రయానికి ముందు ఏవో కు తెలియజేయాలని, అధిక ధరలకు విక్రయించినట్టయితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు, ప్రతి రైతు విత్తనం కొనుగోలుకు ముందు విధిగా లైసెన్సు పొందినటువంటి విత్తన షాపు నందు మాత్రమే విత్తనాలను కొనుగోలు చేసి రసీదును మరియు ఖాళీ సంచిని కూడా పంట నిమిత్తం భద్రపరచుకోవాలని ఇంకా ఏదైనా అనుమానాలు ఉంటే మండల వ్యవసాయ అధికారిని సంప్రదించాలని సూచించారు.