PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మధ్యాహ్నం భోజనంను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎంపీడీఓ

1 min read

పల్లెవెలుగు వెబ్ చెన్నూరు: మండలంలోని అన్ని గ్రామాల సచివాలయాలు పాఠశాలలో అధికారులు, సిబ్బంది బాధ్యతగా మెలిగి తదనుగుణంగా ప్రజలకు సహకరించాలని ఎంపీడీవో కిరణ్ మోహన్ రావు సూచించారు .ఆయన గురువారం మండలంలోని ఉప్పరపల్లె, శివాలపల్లిలోని సచివాలయాలను, పాఠశాలలను ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కార్యాలయ అధికారులకు పలు సూచనలు సలహాలు ఇచ్చారు ముఖ్యంగా కార్యాలయ సిబ్బంది బాధ్యతయుతంగా అన్ని రికార్డులను సక్రమంగా నిర్వహించాలని, సమయపాలన పాటించాలని ,రిజిస్టర్లో రోజుకు మూడుసార్లు సంతకాలు చేయాలని పేర్కొన్నారు. అలాగే ఏ సమయంలోనైనా ఎటువంటి సమాచారం అడిగిన తప్పనిసరిగా అందించాలని హెచ్చరించారు .సచివాలయంలోనికి వచ్చిన వారితో బాధ్యతాయుతంగా మెలిగి వారికి సహకరించాలని ఆయన తెలిపారు ,సూచనలు పాటించని సిబ్బందిపై కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లే విధంగా ప్రవర్తించవద్దని హెచ్చరించారు.

మధ్యాహ్న భోజనంసంతృప్తికరం:

ఎంపీడీవో చేసిన తనిఖీలో భాగంగా ఉప్పరపల్లె ఎంపీ యూపీ పాఠశాలలో కొనసాగించే మధ్యాహ్నం భోజనం పరిశీలన చేయడంతో పాటు ఆ పిల్లలతోపాటు కలిసి భోజనం చేశారు ఆయన పిల్లలకు అందించే ఆహారం సక్రమంగా ఉందని సంతృప్తిని వ్యక్తం చేశారు మిగతా మండలాలతో పోలిస్తే ఈ పాఠశాలలో భోజనం బాగా చేశారని ఇదేవిధంగా కొనసాగించాలని సూచించారు ఈ పరిశీలనలో శివాలపల్లె సర్పంచి ఎంపీడీవో కార్యాలయం సిబ్బంది ఉపాధ్యాయులు ,విద్యార్థులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *