PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్స్ తనిఖీలు

1 min read

చైల్డ్ కేర్ సెంటర్లలో ప్రమాదాలు జరగకుండా తగు జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి

డోనర్ అందించే కార్యక్రమాల ఆహార పదార్థాలు తీసుకొనరాదు

ఆకస్మిక తనిఖీలు చేసిన డిస్టిక్ లెవెల్ ఇన్స్పెక్షన్ టీం

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : పెదపాడు ఐసిడిఎస్ ప్రాజెక్ట్ పరిధిలో రిజిస్ట్రేషన్ అయి లైసెన్స్ పొందిన 6 చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్స్ ను 1. SMC Boarding Home, పెదవేగి, 2. Infant Jesus Children Home,Vegiwada, 3.Sr Selina memorial children home,Vegavaram,4. St John’s care children home, paduvnagar,5. Win our N children home, bhogapuaram 6. Gunnel Orphanage children home,vatluru) లను జిల్లా తనిఖీల  కమిటి శనివారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం జరిగింది. అక్కడ బాలలకు అందిస్తున్న వసతి మరియు ఆహార సదుపాయాలను క్షుణ్ణంగా పరిశీలించి  తగు సూచనలు చేయటం జరిగింది. ప్రతీ చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్ లోనూ కూడా ఏ విధమైన ప్రమాదములు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి అని బయట వ్యక్తులు ఎవరైనా డొనేషన్ రూపంలో  వండిన ఆహార పదార్థాలను, లేక వారి వారి ఇండ్లలో జరిగిన శుభకార్యాలలో మిగిలిన ఆహార పదార్థాలను తీసుకోవద్దని స్పష్టంగా తెలియజేయటమైంది.జువెనైల్ జస్టిస్ యాక్ట్ 2015 సెక్షన్ 41 ప్రకారం రిజిస్ట్రేషన్ ఖచ్చితంగా  నమోదు చేయించుకోవాలని తెలియచేసినారు. డిస్టిక్ లెవెల్ ఇన్స్పెక్షన్ టీంలో డిస్టిక్ ప్రోబేషన్ ఆఫీసర్ మరియు నోడల్ ఆఫీసర్ చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్ ల కన్వీనర్. జె.దుర్గాప్రసాద్, కో-కన్వీనర్  మరియు డిస్టిక్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ డా:సిహెచ్.సూర్య  చక్రవేణి, మెంబెర్స్.ఏలూరు పెదపాడు ఐసిడిఎస్ ప్రాజెక్ట్ చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్.కె.విజయలక్ష్మి, డిసీపీయు లోని ఇన్స్టిట్యూషనల్ కేర్ ఆఫీసర్ సిహెచ్.శ్రీకాంత్ లీగల్ పొబేషన్ ఆఫీసర్ సి.జాహ్నవి తదితర సిబ్బంది  పాల్గొన్నారు.

About Author