స్కానింగ్ సెంటర్లను సబ్ డిస్ట్రిక్ట్ కమిటీ సభ్యుల ఆకస్మిక తనిఖీలు
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: రెవెన్యూ డివిజినల్ ఆఫీసర్ కర్నూలు కార్యాలయం లో PC & PNDT సబ్ డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటి మీటింగ్ RDO . శేషి రెడ్డి ఆద్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమములో ఆయన మాట్లాడుతూ సబ్ డిస్ట్రిక్ట్ లో ఉండే స్కాన్నింగ్ సెంటర్స్ కొత్త రిజిస్ట్రేషన్లు, రెన్యూవల్ కు అప్లై చేసుకున్న వాటిని ప్రోగ్రాం ఆఫీసర్స్ తనిఖీలు చేసి వారి యొక్క పత్రమలు అన్నియు సరిగ్గా ఉన్నచో వాటి ఇన్స్పెక్షన్ రిపోర్టు ను జిల్లా స్థాయి కమిటీ కి తదుపరి ఆమోదం కొరకు సమర్పించబడునని తెలిపారు. డివిజన్ లో ఉన్నటు వంటి స్కానింగ్ సెంటర్లను సబ్ డిస్ట్రిక్ట్ కమిటీ సభ్యులచే ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని,ఆడ పిల్లల ప్రాముఖ్యత గురుంచి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కమిటీ తీర్మాణం చేయడమైనది. గర్భస్త లింగ నిర్ధారణ గురుంచి ఎవ్వరికి మాటల రూపములో గాని చేతల రూపములో లో గాని సైగ ల రూపములో లో గాని చెప్పరాదని మరియు స్కాన్నింగ్ కు వచ్చినప్పుడు వారికి లింగ ఎంపిక – నిర్ధారణ గురుంచి చెప్పకూడదు అలా చెప్పిన యెడల PC&PNDT చట్టం ప్రకారం చర్యలు తీసుకోబడునని తెలిపారు. ఈ కార్యక్రమములో జిల్లా నోడల్ ఆఫీసర్ PC & PNDT డాక్టర్ Y నాగప్రసాద్ బాబు , గైనకాలజిస్ట్ డాక్టర్ కిరణమయి , 2 వ పట్టణ సబ్ ఇన్స్పెక్టర్ శ్రీమతి బిందు మాధవి డెమో ప్రమీలాదేవి , NGO లు రాయపాటి శ్రీనివాసులు, మద్దిలేటి , HEEO శ్రీనివాసులు , డిప్యూటీ డెమో చంద్రశేకర్ రెడ్డి , PNDT ప్రోగ్రాం కన్సల్టెంట్ సుమలత పాల్గొన్నారు.