PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రభుత్వ ఉద్యోగులకు మధ్యంతర భృతి (ఐఆర్) వెంటనే ప్రకటించాలి

1 min read

12వ పీఆర్సీ కమిషనర్ తక్షణమే నియమించి, త్వరితగతిన అమలు చేసి ఉద్యోగులను ఆర్థికంగా ఆదుకోవాలి

బహుళ సభ్యత్వం కు ఏపీ జేఏసీ అమరావతి వ్యతిరేకం

ఒక ఉద్యోగి ఒక్క సంఘంలోనే సభ్యులుగా ఉండాలి

ఏపీ జెఎసి అమరావతి అనుబంధ సంఘాల్లోని సభ్యులు ఎవరూ ఏపీ ఎన్జీ జిఓ, ఏపీ జి.ఈ.ఏ లాంటి కామస్ కేటగిరీ లేదా ఇతర ఏ సంఘాల సభ్యత్వం తీసుకోరాదని ఏకగ్రీవ తీర్మానం

బొప్పరాజు , పలిశెట్టి

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఐఆర్ ప్రకటించాలని, అలాగే గత ప్రభుత్వం నియమించిన 12వ పిఆర్సి కమిషనర్ రాజీనామా చేసినందున వెంటనే పిఆర్సి కమిషను నియమించి, నిర్ణీత కాలపరిమితి లోపు నివేదిక తెప్పించుకుని, వీలైనంత త్వరగా 12వ పిఆర్పి అమలు చేసి, గత 11వ పిఆర్పి సందర్భంగా తీవ్రంగా నష్టపోయిన ఉద్యోగులను ఈ ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని ఏపీ జెఎసి అమరావతి స్టేట్ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, స్టేట్ సెక్రటరీ జనరల్ పలిశెట్టి దామోదర రావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆదివారం ఏలూరు రెవెన్యూ భవన్ లో జరిగిన ఏపీ జెఎసి అమరావతి రాష్ట్ర కార్యవర్గ సమావేశం రాష్ట్ర చైర్మన్ బొప్పరాజు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మరియు 26 జిల్లాల చైర్మన్ / ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను సమావేశం అనంతరం జరిగిన పత్రిక విలేకరుల సమావేశంలో బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రకటించారు.మధ్యంతర భృతి (ఐఆర్) మరియు 12వ పిఆర్సి కమీషనర్ నియామకం,గత దశాబ్దాలుగా కొత్త పిఆర్సి అమలుకు కొంత సమయం తీసుకుంటున్నందున, ఈ లోపు ఉద్యోగులకు మధ్యంతర భృతి (ఐ.ఆర్) నీ ప్రకటించేవారు. వాస్తవానికి 12వ పిఆర్సి 1.7.2023 నుండి అమలు చేయాలి. ఇప్పటికే సంవత్సరం ఆలస్యమైంది. ఈ విధంగా ప్రతి పిఆర్సి లో ఆలయమౌంతుందని మధ్యంతర భృతి ప్రకటిస్తారు. గత ప్రభుత్వం హయంలో ప్రభుత్వ ఉద్యోగులకు 11వ పిఆర్పి అమలు సందర్భంగా ఉద్యోగులు, పెన్షనర్లు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు అందరికీ తీవ్ర అన్యాయం, ఆర్థిక నష్టం జరిగిన విషయం అందరికి తెలిసిందే. కనుక, ప్రస్తుత కూటమి ప్రభుత్వం వారి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు తక్షణమే మద్యంతర భృతి (ఐ.ఆర్) ప్రకటించాలని మరియు 12వ పిఆర్సి కమీషనర్ వెంటనే నియామకం చేసి, నిర్ణీత కాలపరిమితి లోపు నివేదిక తెప్పించుకుని, 11వ పీఆర్సీ అమలు సందర్భంలో జరిగిన నష్టాన్ని 12వ పిఆర్సి ద్వారా భర్తీ చేస్తుందన్న నమ్మకంతో రాష్ట్రంలోని 12 లక్షల మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లు ఆశగా ఎదురు చూస్తున్నారని ఉన్నారని బొప్పరాజు తెలిపారు.  పెన్షనర్లకు అడిషనల్ కౌంటమ్ ఆఫ్ పెన్షన్ పాత స్లాబ్లు పునరుద్ధరించాలి,అలాగే, గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో పెన్షనర్లకు చెల్లిస్తున్న అడిషనల్ కౌంటమ్ ఆఫ్ పెన్షన్ స్లాబులను గత ప్రభుత్వ హయంలో 11వ పీఆర్సీ చర్చల సందర్భంగా కొత్తగా వారు పెన్షనర్లకి పీ పెంచకపోగా, అప్పటివరకు పొందుతున్న శ్లాబులను తగ్గించారని, ఇంత దుర్మార్గం గతంలో ఎన్నడూ జరుగలేదని, కనుక వెంటనే పాత స్లాబ్ ల ప్రకారం పెన్సనర్లకి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ చెల్లించాలని కోరారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ,అంతే కాకుండా, గత ప్రభుత్వం హయాంలో కాంట్రాక్ట్ ఉద్యోగులందరిని రెగ్యులర్ చేస్తామని హామీ ఇచ్చి కేవలం కొంతమందిని ప్రధానంగా ఆరోగ్య శాఖలో వారిని క్రమబద్ధీకరణ చేశారని, విద్యా మరియు ఇతర శాఖల్లో పని చేసే కాంట్రాక్టు ఉద్యోగులను నేటికీ కనుబద్ధీకరింకానందున, తీవ్ర ఆందోళన చెందుతున్నారని కనుక వీలైనంత త్వరగా రెగ్యులర్ కాకుండా మిగిలిపోయిన కాంట్రాక్ట్ ఉద్యోగులను వెంటనే క్రమబద్ధీకరించాలని తద్వారా వారి వారి కుటుంబాల్లో ఆనందాన్ని నింపాలని కోరారు.

రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లింపులు,

అలాగే, ఇప్పటివరకు పదవీ విరమణ చేసిన ఉద్యోగులు, ఉపాధ్యాయులుకు సరిగా పదవీ విరమణ బెనిఫిట్స్ అందడం లేదని, ప్రతి ఉద్యోగి రిటైర్ అయిన తర్వాత వచ్చే బెనిఫిట్స్ తో తన కుటుంట అవసరాలకు వినియోగించుకుంటారని, కానీ గత కొంత కాలంగా రిటైర్ అయిన ఉద్యోగులకు ఎలాంటి టెనిపిట్స్ ఇవ్వనందున రిటైర్ అయిన ఉద్యోగులు తీవ్ర ఆర్ధిక ఇబ్బందులకు గురవుతున్నారనీ, వారి వారి కుటుంబ అవసరాలకు వాడుకోకుండానే కాలం చెల్లే పరిస్థితులు కరోనా తర్వాత నెలకొని ఉన్నాయని, కనుక అందరికీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ వెంటనే చెల్లించాలనీ కోరారు.

ఏపీ జెఎసి అమరావతి సభ్య సంఘాల సభ్యులు ఎన్జీ జిఓ, ఏపీ.జి.ఈ.ఏ లాంటి కామస్ కేటగిరి లేదా ఇతర ఏ సంఘాల సభ్యత్వం తీసుకోకూడదు,

అలాగే ఒక ఉద్యోగి ఒకే సంఘం లో మెంబర్ గా ఉండాలని ఇప్పటికే గత 2019 నుండి ఏపీ జేఏసీ అమరావతి పక్షాన అనేకసార్లు ప్రభుత్వానికి తెలియజేసామని, రోసా రూల్స్ లలో కూడా మార్పులు చెయాలని తేదీ 14.7.2022న ఏపీ జేఏసీ అమరావతి పక్షాన ప్రభుత్వానికి నివేదిక కూడా ఇచ్చామని తెలిపారు.

దశాబ్దాలుగా ఉన్న ఏపీ ఎన్జీవో సంఘం, ఇటీవల రూపాంతరం చెంది కొత్త ఏపీ ఎన్జీజీవోలు గా మార్చుకుని అన్ని శాఖల్లో ఉన్న గజెట్టెడ్ అధికారులను కూడా సభ్యత్వం తీసుకోమని ఎన్టీజీవోలు గజెట్టిడి అధికారులను కోరుతున్నందున, నేటి రాష్ట్ర కార్యవర్గ సమావేశం లో సుదీర్ఘంగా చర్చించిన మీదట. ఆయా శాఖలలో సమస్యలపై పూర్తి అవగాహనతో వ్యవహరించే డిపార్ట్మెంట్ సంఘాల నిర్ణయాలకు ఇతర సంఘాలు భిన్నంగా వ్యవహరించే అవకాశం ఉన్నందున, ప్రధానంగా చాలా శాఖల్లో గుర్తిపు పొందిన అనేక సంఘాల పరిధిలో కామస్ కేడర్ సంఘాలు జోక్యం చేసుకొనే అవకాశం ఉన్నందున, మరికొన్ని ప్రధానమైన అంశాలలో అనవసరమైన భిన్నాభిప్రాయాలకు దారితీసే అవకాశం ఉన్నందున  ఏపీ జేఏసీ అమరావతి అనుబంధ సంఘాల్లో సభ్యత్వం ఉన్న సభ్యులు ఎవరూ కూడా ఏపీ ఎన్జీ జిఓ, ఏపీ.జి.ఈ. ఏ లాంటి కామస్ కేటగిరీ లేదా ఇతర ఏ సంఘాల సభ్యత్వం తీసుకోరాదని మరియు అనవసరమైన వివాదాలకు దారితీసే బహుళ సభ్యత్వాన్ని ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని “ఏపీజే అమరావతి రాష్ట్ర కార్యవర్గంలో ఏకగ్రీవంగా తీర్మానించడం జరిగింది. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు.

ఈ సమావేశంలో పాల్గొన్న పలిశెట్టి దామోదరరావు మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి మేనిఫెస్టో లో ఇచ్చిన హామీ మేరకు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు గత ప్రభుత్వం తొలగించిన ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ వర్తించేలా చూడాలని, విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర కోశాధికారి గారికి ఘన సన్మానం. ఈ సమావేశంలో ఇంతవరకు ఏపీజేఎసి అమరావతిలో రాష్ట్ర కోశాధికారిగా పనిచేసిన రాష్ట్ర పంచాయతీ రాజ్ ఇంజనీర్ల సంఘం రాష్ట్ర అధ్యకుడు శ్రీ వివి మురళీకృష్ణ నాయుడు గారు ఈ నెల 31న ఉద్యోగ విరమణ చేస్తున్న సందర్భంగా ఈ సమావేశంలో ఆయన ను ఏపీ జేఏసీ అమరావతి పక్షాన ఘనంగా సత్కరించారు.  కొఆప్షన్ ద్వారా నూతన రాష్ట్ర కార్యవర్గ సభ్యులు,ఏపీజే అమరావతి రాష్ట్ర కమిటీలో ఏర్పడిన ఖాళీల్లో నలుగురు సభ్యులను కొత్త గా ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర కమిటీ లోకి ఈ క్రింద తెలిపిన పోస్ట్లలోకి తీసుకోవడం జరిగింది. కనపర్తి సంగీతరావు (పంచాయతీరాజ్ రాజ్ ఇంజనీర్ల సంఘం) రాష్ట్ర కోశాధికారి ,జనుకుల శ్రీనివాసరావు (పోలీసు అధికారుల రాష్ట్ర సంఘం)  రాష్ట్ర కో చైర్మన్,డి.జీ. ప్రసాదరావు (వర్కుచార్జ్ ఎంప్లాయీస్ అసోసియేషన్)  రాష్ట్ర వైస్ చైర్మన్ ,కోనా ఆంజనేయ కుమార్( చంటి) (గ్రాష్ట్ర రెవెన్యూ అధికారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి, ఈ సమావేశంలో అమరావతి అసోసియేట్ చైర్మెన్ టీవీ పణి పెర్రాజు, కోశాధికారి వి. వి. మురళీ కృష్ణ నాయుడు, ప్రచార కార్యదర్శి బిషోర్ కుమార్, స్టేట్ ఉమెన్ కమిటీ చైర్ పర్సన్ పారె లక్ష్మి, సెక్రటరీ జనరల్ పొన్నూరు విజయలక్ష్మి తోపాటు ఏపీజేసి అమరావతి రాష్ట్ర కమిటీ సభ్యులు మరియు 26 జిల్లాల ఏపీజే అమరావతి అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు హాజరయ్యారు.పలిశెట్టి దామోదరరావు సెక్రటరీ జనరల్ ,టి.వి. ఫణి పేర్రాజు, అసోసియేట్ చైర్మన్ Gintaras Roo (పి.వి.రమణ) కో చైర్మన్ ,Ja (పి.ఎస్.ఎస్.ఎస్.పి.శాస్త్రి) కో చైర్మన్ ,S. sinin (ఎస్. శ్రీనివాస రావు) కో చైర్మన్ ,Po (బొప్పరాజు వెంకటేశ్వర్లు) చైర్మన్ ,కె.సంగీత రావు కోశాధికారి, జనకుల శ్రీనివాస్) కో చైర్మన్ జి.శివానంద రెడ్డి కో చైర్మన్ ,బి.కిషోర్ కుమార్ పబ్లిసిటీ సెక్రటరీ పాల్గొన్నారు.

About Author