PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఇంటర్మిడియట్ ఆర్ జె డి రవి అక్రమాలపై విచారణ చేసి సస్పెండ్ చేయాలి

1 min read

రెగ్యులర్ ఆర్ జె డి ని నియమించాలి.

పి ఎస్ యు జిల్లా కార్యదర్శి సురేష్…

పల్లెవెలుగు వెబ్  ఎమ్మిగనూరు : బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్  రాయలసీమ ప్రాంత  రీజనల్ జాయింట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న రవి అక్రమాలపై విచారణ జరిపి సస్పెండ్ చేయాలని, అలాగే రెగ్యులర్ ఆర్ జె డి నియమించాలని ప్రగతిశీల విద్యార్థి సంఘం జిల్లా కార్యదర్శి సురేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఎమ్మిగనూరు పట్టణంలో మీడియా సమావేశంలో  వారు మాట్లాడుతూ గత పది సంవత్సరాల పైగా  కడప నగరం,పెళ్లి మర్రి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపల్ గా ఉంటున్న రవి గారు  జిల్లాలోని ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థను శాసిస్తున్నారని అన్నారు. ప్రిన్సిపల్ గా ఉంటూ ఇన్చార్జి డి వి ఈ ఓ, ఆర్ ఇ ఓ, ఆర్ జె డి గా వివిధ ఉన్నత పదవుల్లో జిల్లా అధికారిగా విధులు నిర్వహిస్తూ అనేక అక్రమాలకు పాల్పడినట్లు ప్రచారం జరుగుతున్నదని తెలిపారు. ఈయన డివి ఈవో గా ఉన్నప్పుడు ఏయిడెడ్ కళాశాలలో టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ విషయంలో అక్రమాలకు పాల్పడినట్లు, ఆర్ ఐ ఓ గా ఉన్నప్పుడు ప్రైవేట్ జూనియర్ కళాశాలలో పర్మిషన్లు విషయంలో అక్రమాలకు పాల్పడినట్లు, ఇంటర్ మీడియట్ పబ్లిక్ పరీక్షల కేంద్రాలు కేటాయించడంలో , పరీక్షల పేపర్స్ రుద్దడంలో కూడా అవినీతి జరిగినట్లు, ఆర్ ఐ ఓ  కార్యాలయం అభివృద్ధి పనులలో చేతివాటం ప్రదర్శిచించడం జరిగింది.ప్రస్తుతం ఆర్జెడిగా ఉన్న సమయంలో కూడా రాయలసీమ జిల్లాలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్టు మరియు ఔట్సోర్సింగ్  అలాగే రెగ్యులర్ టీచింగ్, నాన్ టీచింగ్  సిబ్బంది ట్రాన్స్ఫర్ల విషయంలో  లక్షల రూపాయలు వసూలు చేసినట్లు  రాయలసీమ వ్యాప్తంగా చర్చ జరుగుతున్నదని పేర్కొన్నారు.  ప్రభుత్వ జూనియర్ కళాశాల అభివృద్ధి కోసం నాడు నేడు పథకం కింద కేంటాయించిన బడ్జెట్ ఉపయోగించి కళాశాలలో నాసిరకం పనులు చేయించిన ప్రిన్సిపాల్ కు సపోర్టుగా నిలబడి  వారి వద్ద నుంచి లక్షల రూపాయలు కాజేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాఅని అన్నారు. గతంలో కడప ప్రభుత్వ జూనియర్ కళాశాలకు అయన ప్రిన్సిపాల్ గా వున్న కళాశాల లో  విద్యార్థినిని లైంగిక వేధింపులకు పాల్పడిన వారికి సపోర్టు చేసి కేసులో ఇరుక్కున్న విషయం తెలిసిందే అన్నారు. తమ యొక్క రాజకీయ పలుకుబడితో  ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థను శాసిస్తున్న ఆర్జెడి రవిఅవినీతి అక్రమాలపై సమగ్ర విచారణ చేపట్టి సస్పెండ్ చేయాలని కోరారు.  లేకపోతే రాయలసీమ వ్యాప్తంగా ఉద్యమాలు ఉధృతం చేస్తా  తెలిపారు. అలాగే త్వరలో బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్   ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రెటరీ, కమీషనర్ మరియు విద్యాశాఖ మంత్రి కి ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పి ఎస్ యు నాయకులు మధు సాయి పాల్గొన్నారు.

About Author