PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

 కర్నూలు జిజిహెచ్​లో … అంతర్జాతీయ రేడియాలజి దినోత్సవ కార్యక్రమం

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: ఆసుపత్రి సూపరింటెండెంట్, డా.కె.వెంకటేశ్వర్లు  మాట్లాడుతూ:కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల నందు అంతర్జాతీయ రేడియాలజీ దినోత్సవ వేడుకలు పురస్కరించుకొని వైద్యులు మరియు వైద్య సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆసుపత్రిలో ఒకప్పుడు ఎక్సరే మరియు స్కానింగ్ కోసం మరుసటి రోజు రిపోర్టులు వచ్చేటివి అలాంటి పరిస్థితికి ఇప్పుడు స్వస్తి పలికారు అంతరం పేషంట్లకు ఇబ్బంది కలగకుండా ఎక్సరే మరియు స్కానింగ్ తీసిన ఒక వన్ అవర్ వ్యవధిలోనే ఫిలిమ్స్ మరియు రిపోర్ట్స్ అందజేస్తున్నాము దీని ద్వారా పేషెంట్లకు తత్వరా ట్రీట్మెంట్ అందనున్నట్లు తెలిపారు. రేడియాలజీ విభాగానికి అత్యాధునిక టెక్నాలజీ కల యంత్రాలు అందుబాటులో ఉన్నాయి రేడియాలజీ విభాగానికి ఎలాంటి సాయ సహకారాలు కావాలన్న వారికి చేయడానికి సిద్ధమేని తెలిపారు అనంతరం ఈ ఆసుపత్రిని అభివృద్ధి చేయడానికి మరింతగా కృషి చేయనున్నట్లు తెలిపారు.రేడియాలజీ సిబ్బంది మరింత బాగా కష్టపడి ఆసుపత్రికి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని సిబ్బందికి సూచించారు.ఈ కార్యక్రమానికి కర్నూలు వైద్య కళాశాల ప్రిన్సిపాల్, డా.చిట్టి నరసమ్మ, రేడియాలజీ హెచ్ ఓ డి, డా.రాధా రాణి, డిప్యూటీ సిఎస్ఆర్ఎంఓ, డా.హేమనలిని, హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్స్, డా.శివబాల నగాంజన్, రేడియాలజీ విభాగపు వైద్యులు, డా.హరినాథ్, మరియు టెక్నీషియన్లు తదితరులు పాల్గొన్నట్లు, ఆసుపత్రి సూపరింటెండెంట్, డా.కె.వెంకటేశ్వర్లు,  తెలిపారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *