విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలి
1 min readహోళగుందవిద్యుత్ ఏఈ కి హోళగుంద గ్రామస్తుల విన్నపము..
పల్లెవెలుగు వెబ్ హోళగుంద: హోళగుంద గ్రామంలో గత వారం రోజులుగా కరెంటు కోతలు విపరీతంగా విధిస్తుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఏదో ఒక లైనులో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడితే గ్రామం మొత్తము విద్యుత్తు సరఫరా నిలిపేస్తున్నారు. సుమారు మూడు నుంచి నాలుగు గంటల వరకు విద్యుత్ కోతలు విధిస్తుండడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాకాలం కావడంతో ఉక్కపోతతో పాటు దోమల బెడద విపరీతంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో విద్యుత్ కోతలు విధించడం వల్ల ప్రజలు ముఖ్యంగా చిన్నపిల్లలు తీవ్ర ఇబ్బందులకు లోనవుతున్నారు. కాబట్టి గ్రామంలో విద్యుత్ కోతలు లేకుండా విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము. ఎక్కడైనా విద్యుత్ సరఫరా లో అంతరాయం ఏర్పడితే గ్రామం మొత్తం కరెంట్ తీసేయకుండా, ఆ లైన్ కి సంబంధించి మాత్రమే కరెంటు కట్ చేసి సరి చేయాలని కోరుతున్నాము. విద్యుత్ కోతలు ఇలాగే కొనసాగితే గ్రామస్తులతో కలిసి విద్యుత్ సబ్బేషన్ ముందు ఆందోళనలు, ధర్నాలు చేపడతామని తెలియజేస్తున్నాము. దయచేసి విద్యుత్ అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము ఈ కార్యక్రమంలో బి, అబ్దుల్ సుభాన్, అశోక్, ముల్లా మోయిన్, రామాంజనేయులు, వరల వీరేష్, జుమ్మా సలీం, ఖాజా, బి, ఖలీల్, సుభాన్, ఫారుక్ ,తదితరులు పాల్గొన్నారు.