వినియోగదారుల హక్కుల అవగాహన గోడ పత్రికల ఆవిష్కరణ
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కన్జ్యూమర్స్ అఫైర్స్ ఫుడ్ అండ్ సివిల్ సప్లై డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో సిల్వర్ జూబ్లీ కళాశాలలో జరిగిన అవగాహన కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ బి .నవ్య ఐ.ఏ.ఎస్ సమక్షంలో నైస్ యూత్ ఫర్ కల్చర్ అండ్ ఎడ్యుకేషన్ సొసైటీ ,నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, యాక్సిస్ హ్యూమన్ రైట్స్ ఇంటర్నేషనల్ సంయుక్త ఆధ్వర్యంలో వినియోగదారుల హక్కుల అవగాహన గోడ పత్రికలను నైస్ యూత్ ఫర్ కల్చర్ అండ్ ఎడ్యుకేషన్ సొసైటీ అధ్యక్షులు,లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూల్ మెల్విన్ జోన్స్ ప్రతినిధి లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ డి.వి.ఆర్ సాయి గోపాల్ ,జిల్లా కన్జ్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ సివిల్ సప్లై డిపార్ట్మెంట్ ఆఫీసర్ డి .ఎస్. ఓ రఘువీర్, ఆర్డిఓ కే .సందీప్ కుమార్, జిల్లా వినియోగదారుల కమిషన్ మెంబర్ నారాయణరెడ్డి, క్లస్టర్ యూనివర్సిటీ సిల్వర్ జూబ్లీ కళాశాల క్యాంపస్ ప్రిన్సిపల్ వి.వి సుబ్రహ్మణ్య కుమార్, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ విశ్వేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నైస్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకొని వినియోగదారుల హక్కులు చట్టాలు అనే అంశంపై 14 నుంచి 18 సంవత్సరాలలోపు యువతి యువకులకు నైస్ కంప్యూటర్స్ కార్యాలయంలో వ్యాసరచన పోటీలను నిర్వహించి నిర్వహించి సర్టిఫికెట్లు, బహుమతులు అందజేశారు. వ్యాసరచన పోటీల ప్రారంభ కార్యక్రమంలో లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ లోప భూయిష్టమైన వస్తువులు, నిర్లక్ష్య సేవలు మరియు అన్యాయమైన వాణిజ్య పద్ధతుల నుండి వినియోగదారులను రక్షించడమే ఈ చట్ట లక్ష్యం అన్నారు .వస్తు సేవలో లోపాలు జరిగితే జిల్లా వినియోగదారుల కమిషన్ లో ఫిర్యాదు చేయవచ్చని, లేదా 1915, 1800114000 టోల్ ఫ్రీ నెంబర్ల ద్వారా గాని ఫిర్యాదు చేయవచ్చని లేదా వెబ్ సైట్ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చు అన్నారు. కార్యక్రమంలో లక్ష్మీ ఎడ్యుకేషనల్ సొసైటీ అధ్యక్షురాలు లయన్ రాయపాటి నాగలక్ష్మి, యువతీ యువకులు పాల్గొన్నారు.