పెట్టుబడిదారులకు భరోసా.. టీజీ భరత్
1 min read– టీడీపీ జిల్లా నాయకులు సోమిశెట్టి హరికృష్ణ, రియల్ టైమ్ నాగరాజు యాదవ్
- మంత్రి పుట్టినరోజున సేవా కార్యక్రమాలు నిర్వహించిన అభిమానులు
కర్నూలు, పల్లెవెలుగు: రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టిజి భరత్ … మరెన్నో పదవులు పొందాలని ఆకాంక్షించారు టీడీపీ జిల్లా నాయకలు సోమిశెట్టి హరికృష్ణ, రియల్ టైమ్ నాగరాజు యాదవ్. సోమవారం మంత్రి టీజీ భరత్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని నగరంలోని గాయత్రి గోశాలలో మంత్రిని కలిసి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అంతకు ముందు దేవాలయంలో ప్రత్ర్యేక పూజలు చేశారు. మంత్రి టీజీ భరత్ పుట్టిన రోజు సందర్భంగా టీడీపీ అభిమానులు, టీజీ ఫ్యాన్స్ ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. కొందరు రక్తదానం చేయగా… మరికొందరు పండ్లు , బ్రెడ్లు పంపిణీ చేశారు. టీడీపీ జిల్లా నాయకులు సోమిశెట్టి హరికృష్ణ, రియల్ టైమ్ నాగరాజు యాదవ్ స్థానిక ధర్మపేటలో వెయ్యి మందికి పైగా లంచ్ బాక్స్‌లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టిజి భరత్ ప్రజలకు ఉత్తమ సేవలు అందించి… మంచి పేరు తెచ్చుకుంటారన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు బ్రాండ్‌తో మంత్రి టీజీ భరత్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు కంపెనీల యజమానులు క్యూ కట్టారని, త్వరలో కర్నూలుకు కూడా పరిశ్రమలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. పెట్టుబడిదారులకు భరోసా ఇచ్చేలా సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి టీజీ భరత్ సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటారన్నారు. కార్యక్రమంలో అష్రఫ్, వేణుగోపాల్ రెడ్డి, కిరణ్, ప్రవీణ్, నజీర్, సురేష్; తనిష్ వేణు, బాష తదితరులు ఉన్నారు.