ప్రపంచ బ్రెయిలీ దినోత్సవ కార్యక్రమానికి ఎం.పి కి ఆహ్వానం
1 min readఎంపిని అహ్వానించిన అంధుల సమైక్య నాయకులు
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు నగరంలో ఈ నెల 11న నిర్వహించే ప్రపంచ బ్రెయిలీ దినోత్సవ కార్యక్రమానికి కర్నూలు ఎం.పి బస్తిపాటి నాగరాజును అంధుల సమైక్య ఆహ్వానించింది.. అంధుల సమైక్య జిల్లా అధ్యక్షులు పుష్ప రాజు ఆధ్వర్యంలో నగరంలో ని ఎం.పి కార్యాలయంలో ఎం.పి నాగరాజు ను కలిసిన సమైక్య నాయకులు బ్రెయిలీ దినోత్సవంలో పాల్గొనాలని కోరారు… ఈ సందర్భంగా అంధులు ఎదురుకుంటున్న పలు సమస్యలను సమైఖ్య నాయకులు ఎం.పి దృష్టికి తీసుకురాగా , సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.