జగనన్న కాలనీలో అక్రమాలను విచారించాలి..
1 min readజగనన్న కాలనీలో అవకతవకలు జరిగాయి…
జగనన్న కాలనీలో మిగిలిన ఇళ్ల స్థలాలను పేదలకు ఇవ్వాలి…
రెవెన్యూ సదస్సులో తహసిల్దార్ సతీష్ కు వినతి పత్రం ఇచ్చిన తెదేపా నాయకులు….
పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: గత వైసీపీ ప్రభుత్వంలో సొంత ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలతోపాటు ఇల్లు నిర్మించి ఇవ్వాలనే లక్ష్యంలో భాగంగా హోళగుంద గ్రామంలోని జగనన్న కాలనీలో ఇళ్ల స్థలాలకు సంబంధించి అవకతవకలు అక్రమాలు జరిగాయని వాటిని విచారించి మిగిలిన ఇళ్ల స్థలాలను ఇల్లు లేని నిరుపేదలకు ఇవ్వాలని కోరుతూ కూటమి నాయకులు రెవెన్యూ సదస్సులో భాగంగా గురువారం తహసిల్దార్ సతీశ్ కు వినతి పత్రం ఇచ్చారు. జగనన్న కాలనీలో సుమారు 58 ఇళ్ల స్థలాలు అక్రమాలకు గురయ్యాయి అని, వాటిని విచారించి నిరుపేదలకు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిబిఎన్ ఆర్మీ మోయిన్, తెదేపా నాయకులు అయ్యప్ప రెడ్డి, వలి,శాలి అమన్, తదితరులు పాల్గొన్నారు.