29న నీటి పారుదల సలహా మండలి సమావేశం
1 min readజిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా
పల్లెవెలుగు వెబ్ నంద్యాల: ఈ నెల 29న కలెక్టరేట్ లోని సెంటినరీ హాలులో నీటి పారుదల సలహా మండలి సమావేశం నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఖరిఫ్ 2024-25 సంవత్సరం ఖరిఫ్ పంటలకు నీటి విడుదలకు సంబంధించి ఈ నెల 29వ తేదీన సెంటినరీ హాలులో మధ్యాహ్నం 3-00 గంటలకు నీటి పారుదల సలహా మండలి సమావేశం జరుగుతుందన్నారు. నీలం సంజీవ రెడ్డి సాగర్ శ్రీశైలం ప్రాజెక్ట్, తెలుగు గంగ పథకము- ఆయకట్టు, ఎస్.ఆర్.బి.సి. ప్రాజెక్టు, కె.సి. కాలువ – ఆయకట్టు, శివ భాష్యం సాగర్ ప్రాజెక్ట్ (వరదరాజ స్వామి గుడి ప్రాజెక్ట్) – ఆయకట్టు, సిద్దాపురం ఎత్తిపోతల పథకము, హంద్రీ నీవా సుజల స్రవంతి పథకము – ఆయకట్టు, చిన్న నీటి వనరులు మరియు ఎ.పి.ఎస్.ఐ.డి.సి. – ఆయకట్టు తదితర అజెండా అంశాలపై సమావేశం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగే నీటి పారుదల సలహా మండలి సమావేశంలో రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్, రోడ్లు భవనాలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, నంద్యాల పార్లమెంట్ సభ్యులు బైరెడ్డి శబరి, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొననున్నారు.