ఎస్సీ ఎస్టీ వర్గీకరణ రాజ్యాంగ బద్ధమేనా..?
1 min readరేపు పట్టణంలో నిరంతర నిరసన ర్యాలీ-మాల మహానాడు
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: ఎస్సీ ఎస్టీ వర్గీకరణ రాజ్యాంగ బద్దమేనా..? గురువారం తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టు వర్గీకరణ అంశాన్ని రాష్ట్రాలు చూసుకోవాలని తీర్పు ఇవ్వడం పట్ల త్వరలోనే కార్యాచరణ ప్రకటిస్తామని మాల మహానాడు సీనియర్ నాయకులు డాక్టర్ రాజు అన్నారు.నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో శనివారం మాల మహానాడు తాలుకా అధ్యక్షులు ఏసీ నాగేష్ ఆధ్వర్యంలో వర్గీకరణ రద్దు చేయాలని మాల మహానాడు కార్యాలయం నుండి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం కూడలి దగ్గరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి అనంతరం నాయకులు మాట్లాడుతూ రాజ్యాంగం లోని 341 14 15 16 18 నన్ను గౌరవించాలని పార్లమెంటులో బిల్లు పెట్టకుండా మెజార్టీ సభ్యుల ఆమోదం లేకుండా వర్గీకరణ ఎలా చేస్తారని ప్రశ్నించారు. అదేవిధంగా 2004 లో ఐదుగురి న్యాయమూర్తుల సుప్రీంకోర్టు ధర్మాసనం వర్గీకరణ చెల్లదని రాష్ట్రాలకు అధికారం లేదని తీర్పు ఇచ్చిందని మరి 20 సంవత్సరాల తర్వాత అదే తీర్పుకు వ్యతిరేకంగా ఏడుగురి ధర్మాసనం వర్గీకరణ చేయవచ్చని రాష్ట్రాలకు అధికారాలు ఇవ్వడం బాధాకరం అన్నారు.ఏడుగురి ధర్మసానంలో ఒకరైన జస్టిస్ బేల త్రివేది కులాల జాబితాను మార్చడానికి వీలు లేదని విడిగా ఇచ్చిన తన అసమ్మతిన తీర్పులో చెప్పడం జరిగిందన్నారు.మాల జాతిని ఒకే తాటిపై నడిపించి వివిధ రూపాల్లో మాలలకు జరిగిన అన్యాయానికి నిరసనలు తెలియజేస్తామన్నారు. మాలలను చైతన్యం చేసి రాజ్యాంగబద్ధమైన హక్కులను కాపాడుకుంటామన్నారు త్వరలోనే 9 మందితో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనాన్ని ఆశ్రయించి జాతికి జరిగిన అన్యాయ విషయమై ఆపిల్ చేస్తామన్నారు.రేపు సోమవారం రోజున పట్టణంలో మాల మహానాడు కార్యాలయం నుండి పటేల్ సెంటర్ తహసిల్దార్ కార్యాలయం వరకు నిరంతర నిరసన ర్యాలీ అనంతరం తహసిల్దార్ కు మెమోరండం సమర్పించడం జరుగుతుందని వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో అబ్రహాం,దేవన్న, పట్టణ కార్యదర్శి మనోహర్, ఉదయ్ మురహరి రాజన్న సగినేల రమణ డాక్టర్ కృపాకర్ వెంకటస్వామి ప్రసాదు పార్థుడు అనిల్ తదితరులు పాల్గొన్నారు.